Telangana: బిఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్న కవిత…!

Telangana: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక‌లపై బీఆర్ఎస్ ఆశ‌లు వ‌దులుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే పార్టీలో నెల‌కొన్న అంత‌ర్గ‌త క‌ల‌హాలు, కేసీఆర్‌ కుటుంబ స‌మ‌స్య‌లు, స్థానిక నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో బీఆర్ఎస్ స‌త‌మ‌త‌మ‌వుతుండ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. వీటికి తోడు తాజాగా బీఆర్ఎస్‌ను క‌ల్వ‌కుంట్ల క‌విత టెన్ష‌న్ పెడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక‌లో క‌విత పోటీ చేయ‌బోతున్నార‌నే ప్ర‌చారం ఆ పార్టీని క‌ల‌వ‌ర‌పెడుతున్న‌ట్టు స‌మాచారం. బీఆర్ఎస్‌ను వీడిన అనంత‌రం క‌విత‌ కొత్త రాజకీయ పార్టీ స్థాపించేందుకు…

Read More

Hyderabad:బీసీ రిజర్వేషన్లపై గందరగోళం…!

హైదరాబాద్‌: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్ట సవరణపై గవర్నర్ ఆమోదముద్రకు సంబంధించి గందరగోళం నెలకొంది. తెలంగాణ పంచాయతీ రాజ్ (రెండో సవరణ) చట్టం–2025 బిల్లుపై గవర్నర్ సంతకం చేయడంతో గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ సవరణలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ, నల్గొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటను కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారు. అయితే, గ్రామీణ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల సడలింపుకు ఉద్దేశించిన…

Read More

Hyderabad: కవిత సస్పెన్షన్ బిఆర్ఎస్ గుంట నక్కల కుట్ర…?

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఇటీవల కనిపిస్తున్న తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత వ్యక్తిత్వ హననం కోసం కొందరు పద్ధతి ప్రకారం కుట్రలు పన్నుతున్నారని పార్టీ అంతర్గత వర్గాలే ఆరోపిస్తున్నాయి.కుట్రలో భాగంగానే కవిత సస్పెన్షన్ జరిగిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. మొదటగా ఒక స్వయంప్రకటిత మేధావి ద్వారా కవితపై వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేయించి, ఆ వీడియోలను కార్యకర్తల చేత సోషల్ మీడియాలో వైరల్‌ చేశారు. దీంతో కవితను…

Read More

క‌విత వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌లు – బీఆర్ఎస్‌కు మ‌రింత న‌ష్టం చేసేలా స్కెచ్‌..!

Telangana: బీఆర్ఎస్ నుంచి సస్పెన్ష‌న్‌కు గురైన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ క‌విత ఎమ్మెల్సీ స‌భ్య‌త్వానికి, పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. అయితే దీనిపై బుధ‌వారం మీడియాతో మాట్లాడిన క‌విత చివ‌ర్లో వ్యూహాత్మ‌కంగా “జై కేసీఆర్” నినాదాన్ని ఎత్తుకున్నారు. క‌విత ఈ నినాదాన్ని కాక‌తాళీయంగా చేసిన‌ది కాద‌ని, జై కేసీఆర్ అని పార్టీ నుంచి స‌స్పెండ్ అయిన త‌రువాత కూడా నిన‌దించ‌డం ద్వారా బీఆర్ఎస్‌లోని అసంతృప్తి వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పికొనేందుకు ఆమె వ్యూహాత్మ‌క అడుగులువేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.  కేసీఆర్‌పై గౌర‌వం…

Read More

Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ దర్యాప్తు…!!

Hyderabad: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు శాసనసభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో నియమించబడిన విచారణ కమిషన్ తన నివేదికను జూలై 31న ప్రభుత్వానికి సమర్పించింది. అనంతరం ఆగస్టు 4న మంత్రివర్గం ఆ నివేదికను ఆమోదించి, శాసనసభ చర్చకు పెట్టింది. 665 పేజీలతో కూడిన నివేదికలో…

Read More

Telangana: శ్రీ దండు మైసమ్మ అమ్మవారి దేవస్థానం నూతన పాలకవర్గం ఎన్నిక…చైర్మన్గా తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి…!

సూర్యాపేట:  ఆత్మకూరు (s) మండలం శ్రీ దండు మైసమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి,( కాంగ్రెస్ పార్టీ లీడర్ )పాలక వర్గం సభ్యులు ఎన్నికైన్నారు. ఈ ఎన్నిక సందర్బంగా నూతన ఛైర్మన్ తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి ని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి నరోత్తమ్ రెడ్డి, వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణ రెడ్డి, మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సందర్బంగా…

Read More

కవిత ఫైర్‌: “జగదీష్ రెడ్డి లిల్లీపుట్ నాయకుడు!”

Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఆదివారం మీడియాతో కవిత మాట్లాడుతూ..BRS పార్టీలోని ఒక ముఖ్య నేత, తన జాగృతి సంస్థలో కోవర్టులను పెట్టీ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని…ఆ నాయకుడికి చెబుతున్నా… మీ దగ్గర కూడా నా మనుషులు ఉన్నారు.. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ముఖ్య నాయకుడి ఆదేశాలతోనే నాపై జరుగుతున్న దాడులపై…

Read More

Telangana: తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం: కవిత

హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణలో చురుకైన నాయకత్వాన్ని తీర్చిదిద్దుతుందని, తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నామని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం నాడు హైదరాబాద్ లో “లీడర్” పేరిట నిర్వహించిన రాజకీయ శిక్షణ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… కాలానుగుణంగా తెలంగాణ జాగృతి తన పంథాను మార్చుకుందని, ఎప్పుడు కూడా…

Read More

Telangana: టీపీసీసీ చీఫ్ వ్యూహాలు ఫలిస్తున్న వేళ..!!

Hyderabad: తెలంగాణలో గాంధీ భవన్ ప్రజాసమస్యల పరిష్కారానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టాక గాంధీ భవన్ నిత్యం నేతల రాకపోకలతో, కార్యకర్తల హడావుడి ప్రజల రాకతో సందడిగా మారింది. ఆయన వ్యూహాత్మక ఆలోచనలు పార్టీని క్రమంగా ప్రజలకు చేరువ చేయడంతో పాటు పార్టీ బలోపేతం దిశగా నడిపిస్తున్నాయి. *ముఖాముఖి ప్రోగ్రామ్‌ గ్రాండ్ సక్సెస్* టీపీసీసీ చీఫ్ ఆదేశాల మేరకు ప్రజలకు ప్రభుత్వాన్ని దగ్గర చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన…

Read More
Optimized by Optimole