TSAT: యువతకు దిక్సూచి టీ-సాట్..!
T- SAT: సాంకేతికంగా దూసుకుపోతున్న నేటి యుగంలో టీ-సాట్ ఆధునిక టెక్నాలజీతో తెలంగాణలోని అన్నివర్గాలకు చేరువవడమే కాకుండా, ఒక వరంగా మారింది. ప్రస్తుత కాలంలో అన్ని అంశాలు సాంకేతికతతో ముడిపడి ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు, యువతకు, మహిళలకు, రైతులకు ఇలా అందరికీ టీ-సాట్ చేదోడుగా ఉంటుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో ఇంటింటికీ దగ్గరవుతుంది. ఆధునికానికి అనుగుణంగా టీ-సాట్ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని అన్ని రంగాల్లో విస్తరించేలా…