Telugupoetry: పువ్వులూ ‘ మనిషీ ‘…

Poetry: పువ్వులు మట్టి మశానాల పోషకాలతో పూస్తాయి. వాటి మొక్కలకు అందే నీళ్లు కొన్ని మురికిగా, కొన్ని స్వచ్ఛంగా ఉంటాయి. అయినా పువ్వులు పవిత్రమైనవి, అందమైనవి, సుగంధభరితమైనవి. వాటి రంగులు కళ్లకు ఇంపుగా, మనసుకు ఆహ్లాదంగా ఉంటాయి. ఇక మనిషి- పువ్వుల అందాలను చూస్తూ కన్నీళ్ల కన్నా స్వచ్ఛమైన నీళ్లు తాగుతాడు. ఎర్రెర్రని యాపిల్‌ పండ్లను కొరుక్కు తింటాడు. అయినా అసహ్యంగా తయారవుతాడు. ఎందుకలా? — పాష్తో మూలం: పీర్‌ మహమ్మద్‌ కార్వాన్‌ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు…

Read More

Telugu literature: నేటి సాహిత్యం..” చావడానికే బతుకు”..!

Telugu poetry : ” చావడానికే బతుకు”  మనం మన తాత ముత్తాతల అడుగుజాడల్లో చెట్లలా బతుకుతాం. పురిటిగది గూటిలో సాలీళ్లలా బతుకుతాం. దప్పిక అంచుల్లో మరులుగొంటాం. చావు పుట్టుకల నడుమ దయ్యాలకొంపలో కలలు కంటుంటాం. ఇంకా బతికి ఉన్నామేమో అనిపించేలా మనం చనిపోతాం. — వాయుయు మూలం: వీటో అపుషానా స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు

Read More

Poetry: మూల్యం విలువ..!

Panyalajagannathdas:   మూల్యం.. ఏదీ ఆశించకుండా ఉండటం, దేనినీ జ్ఞాపకాల్లో దాచుకోకుండా ఉండటం, తిరిగి రావడానికి సొంత నేలనేది లేకుండా ఉండటం చాలా మంచిదని నాకు తెలుసు. అయితే, అలాంటి పరిస్థితుల్లో మనకు కవితలేవీ అర్థంకావు. నాకు బాగా తెలుసు నీలాంటి మంచి కవితలన్నిటికీ వాటి మూల్యం ఉంటుంది. మంచి కవితలన్నీ మన మనోవేదనను మూల్యంగా చెల్లించుకున్నాకే రూపు దిద్దుకుంటాయి. — ఆస్టురియన్‌ మూలం: జీ ఎం. సంచేజ్‌ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు

Read More
Optimized by Optimole