భారత టెస్టు కెప్టెన్గా రోహిత్ శర్మ..?
భారత జట్టు టెస్ట్ సారథిగా రోహిత్ శర్మను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వన్డే, టీ20 కెప్టెన్గా ఉన్న అతనిని.. బీసీసీఐ పూర్తిస్థాయి టెస్టు సారథిగా ఖరారు చేసిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. కాగా శ్రీలంక తో జరిగే టెస్ట్ సిరీస్ కి ముందే సెలెక్షన్ కమిటీ రోహిత్ పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక తో భారత జట్టు 2 టెస్టులు, 3టీ_20లు ఆడనుంది….