పోడు హక్కుల పత్రాలపై కేసీఆర్‌కు సీఎల్పీ భట్టి విక్రమార్క లేఖ ..
Bhattilettertokcr: పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ కు లేఖరాశారు.ఆదివాసులు, గిరిజనులు అధికంగా నివసించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు, ఖమ్మం, వరంగల్, నల్గొండ తదితర జిల్లాలో పోడుభూముల సమస్యతో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా తాను చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్ ‘ పాదయాత్రలో అనేక మంది గిరిజనులు పోడుభూముల సమస్యలను ఏకరువు పెట్టుకున్నారని..ప్రజాసంక్షేమం, గిరిజనాభివృద్ధే ధ్యేయంగా పనిచేసే…