UGADI : ఉగాది పర్విదినాన ఆచరించాల్సినవి..!
Ugadi: తెలుగు వారు జరుపుకునే అతిముఖ్యమైన పండగ ఉగాది. ఈపండుగ రోజు నుంచి తెలుగు సంవత్సరం మొదలవుతుంది.ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఉగాది జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మాకు అప్పగించిన శుభతరుణంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. ఉగాది రోజున ఆచరించాల్సినవి; తైలాభ్యంగనం ; తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం. ఉగాది పర్వదినాన సూర్యోదయానికి ముందే మహాలక్ష్మి నూనెలోనూ.. గంగాదేవి నీటిలో…