UGADI : ఉగాది పర్విదినాన ఆచరించాల్సినవి..!

UGADI : ఉగాది పర్విదినాన ఆచరించాల్సినవి..!

Ugadi:  తెలుగు వారు జరుపుకునే అతిముఖ్యమైన పండగ ఉగాది. ఈపండుగ రోజు నుంచి తెలుగు సంవత్సరం మొదలవుతుంది.ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఉగాది జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మాకు అప్పగించిన శుభతరుణంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి.

ఉగాది రోజున ఆచరించాల్సినవి; 

తైలాభ్యంగనం ; తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం. ఉగాది పర్వదినాన సూర్యోదయానికి ముందే మహాలక్ష్మి నూనెలోనూ.. గంగాదేవి నీటిలో ఆవహించివుండునని  ఆర్యోక్తి. కావున ఈరోజున నూనెతో తలంటుకుని స్నానమాచరించి లక్ష్మి,గంగా మాతాల అనుగ్రహన్ని పొందండి.

నూతన సంవత్సర స్తోత్రం;  ఉదయాన్నే స్నానం ఆచరించి  సూర్యభగవానుడికి నమస్కరించాలి. అనంతరం మామిడి ఆకులు, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి.. నూతన సంవత్సర పంచాగాన్ని , సంవత్సరాది దేవతను ఇష్టాదేవతారాధనతో పాటు పూజించి, ఉగాది పచ్చడిని నివేదించవలె.

క్రొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక ఈ రోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినకముందే ఉగాది పచ్చడిని తింటారు.

ఉగాది పచ్చడి ; ఉగాది  పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. తీపి,పులుపు, కారం, ఉప్పు, వగరు , చేదు అనే ఆరు రుచుల కలిసిన పచ్చడి సేవనం అత్యంత ప్రధానం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి , చెడులు.. కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలనే ఉద్దేశ్యంతో ఉగాది పచ్చడి సేవించడం ఆనవాయితీ.

ఉగాది పచ్చడిలోని షడ్రుచుల పదార్థాలకు అర్థం ; 

  • బెల్లం ; తీపి, ఆనందానికి సంకేతం
  • ఉప్పు; జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
  • వేప;బాధ అనుభవాలకు సంకేతం
  • పచ్చిమామిడి; వగరు , కొత్తసవాళ్లకు సంకేతం
  • మిరపపొడి (కారం); సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతం.