పార్లమెంట్ సమావేశాల్లో జనాభా నియంత్రణ బిల్లు..?
జనాభా నియంత్రణ, ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టాలని పలువురు భాజపా ఎంపీలు యోచిస్తున్నారు. జులై 19న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. తొలి వారంలోనే ఈ ప్రైవేటు బిల్లులను సభ ముందుకు తీసుకురానున్నారు. ఉభయ సభల సెక్రెటేరియట్లు విడుదల చేసిన సమాచారం ప్రకారం లోక్సభలో ఎంపీ రవికిషన్, రాజ్యసభలో కిరోరి లాల్ మీనా.. ఈ బిల్లులను జులై 24న ప్రవేశపెట్టనున్నారు. జనాభా నియంత్రణపై మరో రాజ్యసభ ఎంపీ రాకేశ్ సిన్హా…