విశాఖపట్నం నోవాటెల్ లో పవన్ కల్యాణ్.. హైదరాబాద్ కారులో షర్మిల!
Nancharaiah merugumala: ======================= ఇద్దరూ బందీలేగాని వారి ప్రతిఘటన తీరులోనే కొట్టొచ్చే తేడా! కిందటి నెల అక్టోబర్ మూడో వారంలో విశాఖపట్నంలో పార్టీ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు జనసేన పార్టీ నేత కొణిదెల పవన్ కల్యాణ్. ఆంధ్రప్రదేశ్ పాలకపక్షం, ప్రభుత్వం పకడ్బందీ పథకంతో పవర్ స్టార్‌ను ఫైవ్ స్టార్ హోటెల్ నోవాటెల్ స్వీట్ (గది) నుంచి బయటకు రాకుండా రెండ్రోజులు బందీగా ఉంచగలిగాయి. పైకి దూకుడుగా ఉద్యమిస్తారనే పేరున్న జనసేన కార్యకర్తలు గాని, ఏపీ ప్రభుత్వంపై…