ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మాట తప్పిన సీఎం కేసీఆర్ వెంటనే గద్దె దిగాలని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్షర్మిల డిమాండ్చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని పేదలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు.
కాగా 3ఎకరాల భూమి ఇస్తామని దళితులను, కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానని విద్యార్థులను, 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మైనార్టీలను సీఎం మోసం చేశారని అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఏడో రోజు రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామానికి చేరుకున్న షర్మిల ఇక్కడే సాయంత్రం వరకు ఒక రోజు నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు.
ఇక నిరుద్యోగులకు నెలకు రూ.3వేల 16రూపాలయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన కేసీఆర్దీనిని అటకెక్కించారన్నారు. రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్చేశారు. కొత్త జిల్లాలు, మండలాలను కలుపుకుని చూస్తే 3.85 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు తేలిందని ఆమె తెలిపారు.