దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఇంధనం ధరలు స్వల్పంగా పెరిగాయి.
తాజా పెట్రోల్ ధరల్ని పరిశీలిస్తే, రాజథాని ఢిల్లీలో పెట్రోల్ 107 రూపాయల 94 పైసలుగా ఉంటే, డీజిల్ 96 రూపాయల 67 పైసలుంది. హైదరాబాద్‌లో పెట్రోల్ 111 రూపాయల 91 పైసలు, డీజిల్ ధర 105 రూపాయల 08 పైసలుగా ఉన్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ 15 పైసలు పెరిగి, 111 రూపాయల 45 పైసలకు చేరుకుంది. అలాగే డీజిల్ ధర 12 పైసలు పెరిగి, 106 రూపాయల 64 పైసలు అయ్యింది. కరీంనగర్‌లో పెట్రోల్ 112 రూపాయల 39 పైసలు, డీజిల్ 105 రూపాయల 52 పైసలు. నిజామాబాద్‌లో పెట్రోల్ 113 రూపాయల 39 పైసలైతే, డీజిల్ 106 రూపాయల 48 పైసలు.
ఇక ఏపీలో ధరల్ని పరిశీలిస్తే, విజయవాడలో పెట్రోల్ 114 రూపాయల 48 పైసలుగా ఉంటే, డీజిల్ ధర 107 రూపాయలకు చేరుకుంది. అయితే, అమరావతి ప్రాంతంలో ఇంధన ధరలు కొద్ది రోజులుగా స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. విశాఖపట్నంలో పెట్రోల్ 112 రూపాయల 66 పైసలైతే, డీజిల్ 105 రూపాయల 27 పైసలు.

Posted inNews