దేశంలో బంగారం ధరలు పలుచోట్ల పెరిగినప్పటికీ హైదరాబాద్‌లో స్వల్పంగా తగ్గాయి. మొత్తంగా చూసుకుంటే గత నాలుగు రోజులుగా దేశంలో బంగారం రేటు పెరిగిందనే చెప్పాలి. ఇక బుధవారం బంగారం ధరలను గమనిస్తే, 22 క్యారట్ బంగారం ధర పది గ్రాములకు 47 వేల 270 రూపాయలుగా ఉంది. 24 క్యారట్ బంగారం పది గ్రాములు 48 వేల 270.
ఇక దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం ధరలు గమనిస్తే, చెన్నైలో 22 క్యారెట్ 45 వేల 380 రూపాయలు, 24 క్యారెట్ బంగారం 49 వేల 510 రూపాయలుగా ఉంది. అదే, హైదరాబాద్‌లో 22 క్యారెట్ బంగారం 45 వేల 50 రూపాయలుగా ఉంటే, 24 క్యారెట్ గోల్డ్ 49 వేల 150 రూపాయలుగా ఉంది. ఇక, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కనిపిస్తున్నాయి.