కేసీఆర్ వాఖ్యలు హాస్యాస్పదం_ కిషన్ రెడ్డి

ఎన్నికల ప్రచారంలో విమర్శలు.. ప్రతి విమర్శలు ఉండొచ్చు.. అవి చాలా సహజం.. కానీ వాటిని అధికార టీఆర్ఎస్ పార్టీ దిగజార్చేలా చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇక ఎలక్షన్ కమిషన్ పై కేసీఆర్ వాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యే లు.. ఎవరి ప్రచారాలను కూడా అడ్డుకోవడం లేదన్నారు. నిబంధనలు అందరికీ సమానమే అన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించినా హుజురాబాద్ ప్రజల డిసైడ్ అయ్యే ఉన్నారని పేర్కొన్నారు. గెలుపు ఓటములు గురించి కాదు ఈ ఎన్నిక, ఈటల రాజేందర్ కు మెజారిటీ ఎంత అన్న దానిపై జరుగుతోందన్నారు.