తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు…

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 41వేల 388 కరోనా పరీక్షలు నిర్వహించగా 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 మందికి పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 111 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. అటు ఏపీలో కొత్తగా 415 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 33,944 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు బయటపడినట్లు ఆరోగ్యశాఖ బులెటిన్ద్వారా వెల్లడించింది. చిత్తూరులో 93, కృష్ణా 76, పశ్చిమగోదావరి 53, గుంటూరు 50 కేసులు నమోదయ్యాయి.