ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్..!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ . ఎన్టీఆర్ – చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అందరిలో ఆసక్తిని పెంచుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు, కీరవాణి సంగీతాన్ని అందించారు. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన హీరోల లుక్స్ మూవీపై అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓవిషయం బయటికొచ్చింది. మూవీ టీజర్ ను అన్ని భాషల్లోనూ ఒకే రోజున ఒకే సమయంలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది మేకర్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో డేట్ నూ ఫిక్స్ చేసే పనిలో చిత్రయూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్యాన్ ఇండియాగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ .. అలియా భట్ వంటి బాలీవుడ్ ఆర్టిస్టులతో పాటు, హాలీవుడ్ ఆర్టిస్టులు నటిస్తున్నారు.