దేశవ్యాప్తంగా గురుపూజోత్సవం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వివిధ ప్రాంతాలలో విద్యార్థులు గురువులను సత్కరించి గురుభక్తిని చాటుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా సత్కరించాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో గురుభక్తిని చాటుతూ కొటేషన్స్ దర్శనమిచ్చాయి. అందులో కొన్ని కొటేషన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి చదవండి.
Happy Teachers Day :
ఎంతోమంది గురువుల దగ్గర
అరువు తెచ్చుకున్న బతుకు నాది.
ఎవరెవరో విడిచిన కలల శకలాల్ని
మూటగట్టుకొని ముందుకెళ్తున్న పయనం నాది.
రోజూ వారికి చెప్పకున్నా ప్రణామం…
అడుగడుగునా వారు నేర్పిన పాఠాలతోనే నా ప్రయాణం!!
_ గణేశ్ తండ (content writer)
Happy teachers day:
టీచర్ వృత్తి అంటే పవిత్రమైంది.
సమాజంలో ఎనలేని గౌరవంతో కూడినది.
విద్యార్థులను సన్మార్గంలో నడిపించే గురుతర బాధ్యత
విద్యార్థులు తమ లక్ష్యాలను నెరవేర్చే వరకు తోడుగా ఉంటే గొప్ప స్నేహితుడు.. మార్గదర్శకుడు టీచర్.
ఉడుత మంజుల( టీచర్)
__________________
జీవితంలో మనకు మంచి చెప్పే ప్రతి ఒక్కరూ గురువుతో సమానం..!!
Vamshikrishna (content writer)
____________________
పాఠాలు జీవిత గుణపాఠాలు నేర్పించిన వారందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు..!!
Vinodkumar ( content writer)
________________________
ఓ ఆచార్య వందనం
శయ్యగత జనావళిని జాగృత
పరుస్తూ …..
అంధకారమనే అజ్ఞానాన్ని
పారదోలి ……
విజ్ఞానపు జ్యోతులు వెలిగించే
చైతన్యమూర్తి …..
అక్షర మకరంద బిందు
మాధుర్యం ఆస్వాదించే
ఓ ఆచార్యుడా …..
అమ్మ ఆలన నాన్న పాలన ..
ప్రేమ కలగలిపిన మాధుర్యం
నిష్కల్మషమైన మనస్సు …..
నిస్వార్థ సద్గుణ సంపన్నుడు
విద్యాసాగరుడు ఆచార్యుడు
విద్యార్థుల ఉషస్సుఉజ్జ్వల
భవిష్యతుకై ……..
అవిశ్రాంత విద్యాసేద్య కృషీ వలుడై …….
విద్యార్థుల హృదయక్షేత్రంలో
జ్ఞానవిత్తనాలు చల్లి అక్షర సేద్యం చేసి ……
తరగని జ్ఞానం అందిస్తూ …..
చెరగని విజ్ఞానం ప్రసాదిస్తూ ..
ఎంత తవ్వినా తరగని విజ్ఞాన ఖని మన ఆచార్యుడు ……
అక్షరమనే ఆయుధంతో జ్ఞాన బిక్షతో పునర్జన్మ నిచ్చిన …….
సద్గుణ సాగరులు ………
ప్రజ్వలిస్తున్న జ్ఞాన జ్యోతులు
జగతికి స్పూర్తి దాతలు …..
సన్మార్గంలో నడిపించే మార్గదర్శకులు ……..
ఓ ఆచార్యా అందుకో …..
మా వందనం అభినందనం
____________________
కోరుట్ల నాగమణి ఐసీడీఎస్
అడవి దేవులపల్లి
___________________