శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన రెండో టి 20 మ్యాచ్‌లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగులుండగానే సీరీస్ సొంతం చేసుకుంది.
కాగా అంతకుముందు టాస్ గెలిచిన భారత్.. లంక జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. నిస్సంక హాఫ్ సెంచరీతో (75)రాణించాడు. ఇండియా బౌలర్లలో భువనేశ్వర్, చాహల్, హర్షల్ పటేల్, బుమ్రా, జడేజా తలో వికెట్ తీశారు.
ఇక 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ(1) పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ స్వల్ప స్కోర్ కే ఔటయ్యడు. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌తో జత కట్టిన శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మూడో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 84 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో సంజూ అవుట్ అయిన.. ఆల్ రౌండర్ జడేజా ధనాధన్ ఇన్నింగ్స్ (45 నాటౌట్ ) మెరవడంతో.. శ్రేయస్ మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశాడు. విండీస్ బౌలర్లలో కుమార 2, చమీర 1 వికెట్ తీశారు.