మంత్రి వీడియో వైరల్ .. నెట్టింట్లో పేలుతున్న సెటైర్స్!

తెలంగాణ వ్యాప్తంగా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు అట్టహసంగా జరిగాయి. పార్టీ కార్యకర్తలు ,అభిమానులు వివిధ జిల్లాల్లో కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈనేపథ్యంలో కేటీఆర్ పై రూపొందించిన వీడియో వాట్సప్ లో తెగ హాల్ చల్ చేస్తోంది. మంత్రి విస్మరించిన హామీలను ఎత్తిచూపుతూ వీడియో సాంగ్ రూపొందించారు. దీంతో ప్రతిపక్ష నేతలు వీడియోపై సెటైర్స్ తో రెచ్చిపోతున్నారు.  అయితే వీడియో ఎవరూ క్రియెట్ చేశారన్న దానిపై మాత్రం స్పష్టత లేదు.

(వాట్సప్ సౌజన్యంతో)

ఇక వీడియోలో.. ఉత్తుత్తి మాటలు ఏతుల చాతలు.. సినిమా సోకులు అంటూ సాగే వీడియోలో .. జీహెచ్ ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మెహన్ తో  పాటు టీఆర్ఎస్ నేతలు కనిపిస్తున్నారు. దీంతో ఆయన అభిమానులు ఈవీడియోపై మండిపడుతున్నారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే కావాలనే ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అటు కేటీఆర్ గాయంపై సైతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ప్రాణాపాయ స్థితిలో విధులు నిర్వహిస్తున్న గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ ..గాయంతో ఉన్న మంత్రి ఫోటో పోల్చుతూ సెటైర్స్ పేలుస్తున్నారు. గాయంతో ఉన్నాను OTT లో సినిమా సజెస్ట్ చేయమనే మంత్రిని చూస్తుంటే గర్వంగా ఉందంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు.

బీజేపీ అభిమానులు అయితే దొరికిందే అదనుగా కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. విజనరీ నాయకుడి చేతలు మాటలు అంటూ సెటైర్స్ విసురుతున్నారు. ఇంతగొప్ప లీడర్ తెలంగాణకు దొరికినందుకు అదృష్టంగా భావిస్తున్నామంటూ ట్రోల్స్ చేస్తున్నారు.