ఉపఎన్నికలోనైనా తెలంగాణ బీసీ ‘గీతలకు, నేతలకు’ గిరాకీ పెరుగుతోంది, సంతోషం..!!

Nancharaiah merugumala:

…………………………………………………

బక్క రెడ్ల కన్నా బలిసిన రెడ్లు ఎక్కువ మంది కనిపించే ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి వంటి తెలంగాణ జిల్లాల తీరే వేరు. తెలంగాణ రాష్ట్రం పుట్టినాక తెలంగాణ లో రెడ్డి కుటుంబాల్లో పుట్టిన శాసనసభ సభ్యుల సంఖ్య పెరిగింది. ముఖ్యమంత్రి ఒక శాతం కూడా లేని పద్మనాయక వెలమ కులానికి చెందిన కె.చంద్రశేఖరరావు కావడంతో రెడ్డీలు లేదా రెడ్లకు రాజకీయంగా ప్రాధాన్యం వారి జనాభా నిష్పత్తి కంటే వంద రెట్లు పెరిగింది. అందుకుకేనేమో మరి 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలయ్యాక కాంగ్రెస్ గురుతుపై గెలిచిన కొద్దీ మంది రెడ్డి ఎమ్మెల్యేలు పీ.సబితా రెడ్డి నేతృత్వంలో టీఆరెస్ లో చేరిపోయారు.

తెలంగాణలో రెడ్ల తర్వాత/సమానంగా రాజకీయ తెలివి ఉన్నోళ్లు పద్మనాయకులే (ఓసీ వెలమ) అని జమీందారీ నేపథ్యం లేని కల్వకుంట్ల సీ ఎస్ రావు గారు నిరూపించారు. శాసనసభ ఎన్నికలకు ఏడాది ముందు వచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో తెరాస రెడ్డి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుని తెలివైన, డబ్బుకు ఆశపడే/అమ్ముడుపోయే బహు సంఖ్యాక రెడ్లు అంతా తన వైపే ఉన్నారని నిరూపించుకోవాలనేది కేసీఆర్ వ్యూహం. వేలకోట్లు సంపాదించిన కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన రాజగోపాల్ రెడ్డి ఓటమి ఖాయం అనుకున్న సమయంలో ఒళ్లు బరువు తగ్గించే మాంచి గవుడ వైద్యుడు డా.బూర నరసయ్య గౌడ్ గారు పెద్ద పద్మ నాయకన్ KCR గారి ప్లాన్ చెడగొట్టారు. పద్మనాయకుడి పార్టీలో టికెట్ రానప్పుడు తెలంగాణ బీసీల్లో బాగా పైకొచ్చిన మున్నూరు కాపుల ఆధిపత్యంలోని కమలం పార్టీలో చేరడమే మేలనుకున్నారు ఒళ్లు కోత డాక్టర్ నరసన్న. తూళ్ల దేవేందర్ గౌడ్ తర్వాత మళ్లీ గౌడ సత్తా చాటిన నరసన్న ఫిరాయింపు పుణ్యమా అని తెలంగాణ చట్టసభల్లో సభ్యత్వం లేని కనకమామిడి స్వామి గౌడ్, దాసోజు శ్రావణ్, మాజీ రాజ్యసభ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, పల్లె రవికుమార్ గౌడ్ వంటి ఓబీసీ నేతలకు టీఆరెస్ లో చక్కటి ప్రవేశం లభించింది. సాధారణ ఎన్నికల్లో బీసీలకు కొద్దిగా కూడా టికెట్లు ఇవ్వని కేసీఆర్ మునుగోడులో బీసీని నిలబెట్టలేదు. కానీ, ముగ్గురు రెడ్ల ముద్దుల పోటీలో టీఆరెస్ రెడ్డి అభ్యర్థిని గెలిపించుకోటానికి గౌడ, తదితర మాజీ టీఆరెస్ ఓబీసీ కులాల నేతలను శరీర ఆలింగనాలతో మళ్లీ  తన సొంత పార్టీలోకి లాక్కోస్తున్నారు.

 

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో మూడు ప్రధాన రాజకీయపక్షాల అభ్యర్థులూ రెడ్లు కాబట్టి, నియోజకవర్గంలో బీసీ కులాల జనం ఎక్కువ ఉన్నందు వల్ల కొద్దిపాటి పేరున్న ఓబీసీ నేతలకు డిమాండ్ పెరిగింది. అయితే, తెలంగాణ వచ్చాక రెడ్లు, వెలమలు, బ్రామ్మలు, కోమట్లు వంటి అగ్రకులాలకే ప్రాధాన్యం పెరుగుతుందని, ఎస్సీ, బీసీలు ప్రధాన రాజకీయ పార్టీల లెక్కల్లో కిందే ఉంటారని దివంగత ప్రసిద్ధ పంజాబీ ఖత్రీ పత్రకారుడు కులదీప్ నయ్యర్ 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో చెప్పిన మాటలు నిజమౌతున్నాయి. సరే, ఎన్నికల్లో కాకపోయినా ఉపఎన్నికల్లో అయినా బీసీ నేతలు, గీతలు బాగుపడడం చూడ్డానికి మాలాంటి పూర్వపు కోస్తా జిల్లాల్లో వేళ్లు, ఊళ్లు ఉన్న వారికి బాగుంది.

Optimized by Optimole