ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన బీజేపీదే అధికారం: జేపీ నడ్డా

తెలంగాణలో బూత్ స్థాయిలో బిజెపిని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని హెచ్ ఐసీసి నోవా హోటల్ లో శనివారం బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ రాజ్యసభ బిజెపి పక్ష నేత పీయూష్ గోయల్, కేంద్ర హోం మంత్రి అమీషా యుపి సీఎం యోగితో పాటు పలు రాష్ట్రాల సీఎంలు పలువురు కేంద్ర మంత్రులు జాతీయ నేతలు , వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ఏ ఆశయం కోసం ఆత్మ బలిదానాలు చేశారో… ఇప్పుడవి నెరవేరడం లేదని.. కుటుంబ పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉండి కూడా.. ఎప్పటికీ అధికారం తమదేనన్న భ్రమలో కొందరు ఉన్నారని పరోక్షంగా కేసీఆర్కు చురకలంటించారు.

మోదీ పాలన అద్భుతం :

8 ఏళ్ల మోడీ పాలన అద్భుతంగా ఉందంటూ నడ్డా కొనియాడారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పాలన సాగిస్తున్నారని అన్నారు. మహమ్మారి కోవిడ్ సమయంలో మోడీ తీసుకున్న సాహోసోపేతా నిర్ణయాలు అతని పాలనకు అద్దం పడుతున్నాయని తెలిపారు. మోడీ 8 ఏళ్లు కాదు మరో 20 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి దేశ ప్రజలు కోరుకుంటున్నట్లు నడ్డా స్పష్టం చేశారు.
తెలంగాణ టార్గెట్:
రెండు రోజులపాటు జరగనున్న బిజెపి జాతీయ వర్గ సమావేశాలు వేదికగా తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన బీజేపీ దే అధికారం కావాలని.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలు.. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. ఇక సమావేశాల ముగింపు సందర్భంగా.. ప్రత్యేక తెలంగాణ పై డిక్లరేషన్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.