తెలంగాణలో కొత్తగా 516 కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 516 కరోనా కేసులు నమోదయ్యాయి.మహమ్మారి నుంచి 216 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,784 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 434 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.

ఇక  రాష్ట్రవ్యాప్తంగా అధికారులు గడిచిన 24 గంటల్లో 26 వేల 976 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఒక్క హైదరాబాద్‌ పరిధిలోనే కొత్తగా 261 కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు వెల్లడించారు. ప్రజలంతా తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.