తెలంగాణలో మరో 1,663 పోస్టుల భర్తీకి ఆర్థికశాాఖ ఉత్తర్వులు..

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.తాజాగా ప్రభుత్వం మరో 1,663 పోస్టుల భర్తీకి ప్రభుత్వం  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం ఖాళీల్లో..ఇంజనీరింగ్ విభాగంలో 1,552 పోస్టులు భర్తీ చేయనుంది. శాఖలవారీగా పోస్టుల వివరాలను చూసినట్లయితే..
_నీటి పారుదల శాఖ లో ఏఈఈ పోస్టులు 704
_ నీటి పారుదల శాఖ ఏఈ పోస్టలు227
_ నీటి పారుదల శాఖలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 212
_ నీటి పారుదల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 95
_ భూగర్భ జలశాఖలో 88 పోస్టులు
_ ఆర్ అండ్ బీలో సివిల్ ఏఈ పోస్టులు 38
_ ఆర్ అండ్ బీలో సివిల్ ఏఈఈ పోస్టులు 145
_ ఆర్ అండ్ బీలో ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులు 13
_ ఆర్ అండ్ బీలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 60
_ ఆర్ అండ్ బీలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 27
_ ఆర్థికశాఖలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు 53

ఇక మిగిలిన పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది.