నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్.. మరో వ్యక్తి దారుణ హత్య!

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మద్దతుగా.. వాట్సప్ గ్రూప్ లో పోస్టును ఫార్వర్డ్ చేసిన ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హతమార్చారు. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 21 న ఈఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈకేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కోసం గాలిస్తున్నామన్నారు. నిందితుడు ఓస్వచ్ఛంద సంస్థ నడుపుతున్నట్లు గుర్తించామన్నారు.ఈకేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇక ప్రహ్లాద్ పోస్ట్ ఫార్వర్డ్ చేసిన వాట్సప్ గ్రూపులో..ముస్లీంకి చెందిన వ్యక్తులు ఉన్నారని.. అప్పటినుంచే నిందుతుడు ఇర్ఫాన్ ఖాన్ అతని హత్యకుట్రకు పన్నారని పోలీసులు తెలిపారు. హత్య పథకాన్ని అమలుచేసేందుకు ఐదుగురు కూలీలతో ఇర్ఫాన్.. పదివేలతో ఒప్పందం చేసుకున్నాడని తెలిపారు. హత్య తర్వాత కారులో పారిపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు అమరావతి పోలీస్ కమిషనర్ ఆర్తి సింగ్ వెల్లడించారు.

రాజస్థాన్ ఉదయ్ పూర్ కి చెందిన టైలర్ కన్హయ్య లాల్ సైతం.. ఇదే తరహలో హత్యగావించబడ్డాడు. ఇప్పుడు మెడికల్ యాజమాని హత్య వెలుగులోకి రావడంతో.. అప్రమత్తమైన కేంద్ర కేసును ఎన్ఐఏ కి అప్పగించింది. గల నెల జూన్ 21 న మెడికల్ షాపు యాజమాని ప్రహ్లాద్ రావు బైక్ పై ఇంటికి వెళుతుండగా.. దుండగులు వెంబడించి అతని మెడపై నరికి పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న ప్రహ్లాదరావును కుమారుడు ఆస్పత్రి తరలించాడు.అప్పటికే అతని మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు..నిందుతులు ఉపయెగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.