తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర గ్రాండ్ సక్సెస్ కావడంతో బిజెపిలో జోష్ కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో తృటిలో విజయం చేజారడంతో క్యాడర్ కొంత నిరాశ చెందింది.ఇప్పుడు ఐదో విడత పాదయాత్రకు ప్రజల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభించడం చూసి..తదుపరి పాదయాత్రకు కమలనాథులు సన్నాహాలు చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా వచ్చిన వినతి పత్రాలను దృష్టిలో పెట్టుకొని ఈ యాత్రను చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇక సంజయ్ ఐదో విడత పాదయాత్రలో 15 వేల పైచిలుకు వినతి పత్రాలు వచ్చాయి. వీటన్నిటిని డిజిటలైజ్ చేయగా… ఈ ప్రక్రియలో డబుల్ బెడ్ రూం ఇల్లు, రుణ మాఫీ, భూములు కోల్పోయి పరిహారం అందని బాధితులు నుంచి అధికంగా వినతులు వచ్చినట్లు కమలం పార్టీ గుర్తించింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు వంటి అంశాల్ని.. క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రణాళికలను రచించాలని కమల దళం వ్యూహాలు రచిస్తోంది.
ఇదిలా ఉంటే ఆరో విడత పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు కమలనాథులు. హైదరబాద్ లో పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో.. నేతల అభిప్రాయ సేకరణ అనుగుణంగా.. గ్రేటర్ లో పార్టీకి పట్టులేని ప్రాంతాల్లో ప్రజా సమస్యల చిట్టా రెడీ చేసి… అందుకనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.