సీఎంకేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండిసంజయ్. అమిత్ షాను తాను గురువుగా భావిస్తానని.. గురు భక్తితోనే చెప్పలు జరిపానన్నారు. అతని మాదిరి గురువును కాలితో తన్నేలేదని మండిపడ్డారు. ఊసరవెళ్లి మాటలు ఆపి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్ష రూపాయల రుణమాఫీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ లేక రాష్ట్రంలో 31 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతుంటే.. ఇక్కడి రైతులను వదిలేసి ..పంజాబ్ వెళ్లి..అక్కడి రైతులకు లక్షలు ఇచ్చాడని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
కాగా కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వలన కాళేశ్వరంతో వేల ఎకరాల్లో పంట నష్టపోయిందని సంజయ్ దుయ్యబట్టారు. అందితే జుట్టు..అందకపోతే కాళ్లు పట్టుకునే నైజం కేసీఆర్ అని అన్నారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన దిల్లీ లిక్కర్ స్కామ్ విషయంపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సోషల్ మీడియలో కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. స్వయంగా వారి పరువును వారే తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఇక కేసీఆర్ పాదయాత్ర ప్రారంభిస్తే..తాను ప్రజా సంగ్రామ యాత్ర ఆపేస్తానని సంజయ్ సవాల్ విసిరారు. ఎనిమిదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి చెప్పకుండా.. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ఏంటన్నారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని ఎందుకు చేయలేదన్నారు. దళితులకు మూడు ఏకరాల భూమి.. నిరుద్యోగ భృతి ఏమైందని సంజయ్ ప్రశ్నించారు.