ట్విట్టర్ టిల్లుకు ‘‘విత్ డ్రావల్ సిమ్టమ్స్’: బండి సంజయ్

వేములవాడ: ట్విట్టర్ టిల్లు ‘‘విత్ డ్రావల్ సిమ్టమ్స్’’కారణంగా మతితప్పి మాట్లాడుతున్నాడని ఎద్దేవాచేశారు బిజేపి స్టేట్ చీఫ్ బండి సంజయ్. ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాత.. నా తల నరకినా, చెప్పుతో కొట్టినా ప్రజల కోసం భరించేందుకు సిద్ధమన్నారు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అధికారిగా ఉంటూ క్రైస్తవ మత ప్రచారం చేస్తారా?అంటూ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పై సంజయ్ విరుచుకుపడ్డారు. అలాంటి అధికారిని రోడ్లమీద ఉరికించి కొట్టండని పిలుపునిచ్చారు.

 

ఇక లాభాల బాటలో ఉన్న సెస్ ను పూర్తిగా దివాళా తీయించిన టీఆర్ఎస్ అభ్యర్థులకు మళ్లీ ఓట్లేసి గెలిపిస్తే…  ఇవే ఆఖరు ఎన్నికలవుతాయని సంజయ్  హెచ్చరించారు. పొరపాటున టీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే సెస్ ను ఎలక్ర్టిసిటీ బోర్డులో కలిపేయడం ఖాయమన్నారు. సెస్ దుస్థితిని చూసి ఎంతో గొప్ప ఆశయంతో ఆ సంస్థను నెలకొల్పిన మహానుభావుల ఆత్మలు ఘోషిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే… సెస్ ను కంటికి రెప్పలా కాపాడుకోవడంతోపాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తామని  సంజయ్ హామీ ఇచ్చారు.

 

 

Related Articles

Latest Articles

Optimized by Optimole