తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యల వెనక మర్మమెంటి? మునుగోడుతో పాటు మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయా? సోదరుడు రాజగోపాల్ తో ఎంపీ వెంకట్ రెడ్డి బీజేపీలో చేరనున్నారా ? ఏ క్షణమైనా పిడుగులాంటి వార్త వినొచ్చు అన్న టీఆర్ఎస్ మాజీ మంత్రి తుమ్మల వ్యాఖ్యలు దేనికి సంకేతం?
యాదాద్రి జిల్లాలో కొనసాగుతున్న మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలివడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి ఎంపీ వెంకట్ రెడ్డి కూడా తమతో టచ్ లో ఉన్నట్లు బాంబ్ పేల్చారు. అంతేకాకుండా పలు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల రానున్నాయని సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
గత కొద్ది రోజులగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొంతమంది కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు కమలం పార్టీలో చేరుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈనేపథ్యంలో సంజయ్ చేసిన కామెంట్స్ తో చేరికలు ఖాయమని తేలుస్తోంది. ఇప్పటీకే కొంతమంది నేతలతో చర్చలు కూడా జరిపారని..
మునుగోడు ఉపఎన్నిక ముగిసిన వెంటనే నేతలంతా బీజేపీలో చేరుతారని పార్టీలో చర్చించుకుంటున్నారు.
అటు టీఆర్ఎస్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏ క్షణమైనా పిడుగు పడొచ్చని… కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునివ్వడంతో టీఆర్ఎస్ కూ గుడ్ బై చెబుతున్నారన్న ప్రచారం ఊపందుకంది.తన వర్గం నేతలతో కలిసి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని.. ఇప్పటికే చర్చలు పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఖమ్మం నేతలు బీజేపీలో చేరుతున్నారని సంజయ్ చేసిన వ్యాఖ్యలకు.. తుమ్మల ఆజ్యం పోసినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వరంగల జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ముఖ్యనేత ప్రదీప్ రావు సైతం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటీకే పార్టీ మార్పు విషయమై ప్రదీప్ రావు ..ముఖ్య నేతలతో చర్చించినట్లు తెలిసింది.జిల్లాలో ఇటీవల సీనియర్ నేత రాజయ్య యాదవ్ టీఆర్ఎస్ కు రాజీనామ చేయగా..స్యయనా మంత్రి ఎర్రబెల్లి సోదరుడైన ప్రదీప్ రావు పార్టీని వీడటం పార్టీకి పెద్ద దెబ్బగా కారు పార్టీ నేతలు భావిస్తున్నారు.