గత కొద్దిరోజులుగా తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది. అందుకు తగ్గట్టుగానే పార్టీ శాసన సభ్యులు, మంత్రులు వీలు చిక్కినపుడల్లా మాట్లాడే మాటలు చూస్తుంటే ప్రచారాలను కొట్టిపారేలేని అర్ధమవుతుంది. రెండు రోజుల కిందట ఓ మంత్రి ఓఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి మార్పు ఉంటే ఉండవచ్చు! తప్పకుండా! ఉంటే ఉంటదండీ!! ” అని వ్యాఖ్యానించారు. మంత్రి మాట్లాడిన మరుసటిరోజే పార్టీకి చెందిన ఓ మంత్రి, కొందరు ఎమ్మెల్యేలు సైతం ఇదే వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే రాష్ట్రానికి కొత్త ‘యువ’ ముఖ్యమంత్రి రాబోతున్నాడన్నది ఖాయంగా కనిపిస్తోంది.
అనేక సవాళ్లు..!
రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొత్త ముఖ్యమంత్రికి అనేక సవాళ్లను ఎదురవుతున్నాయి. దుబ్బాక , జీహెచ్ఎంసి ఎన్నికల్లో వరుస ఓటములతో పార్టీ కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపాలంటే పార్టీకి అత్యవసరంగా ఓ విజయం కావాలి. మరోవైపు పార్టీలోని అసంతృప్తుల సంఖ్య పెరగడంతో వారిని ఎలా బుజ్జగిస్తారన్న ప్రశ్న తలెత్తింది. పార్టీలోని సీనియర్లు జూనియర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితి కనిపిస్తున్న దృష్ట్యా వారిని ఎలా డీల్ చేస్తాడన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
కమలం దూకుడును అడ్డుకోగలరా..?
రాష్ట్రంల్ కాషాయం పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపుతో కమల దళం జోరుమీదుంది. రాష్ట్ర పార్టీ సారధి బండి సంజయ్ దూకుడు మంత్రాన్ని పాటిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరిస్తున్నాడు. ఈ తరుణంలో యువ ముఖ్యమంత్రి కమలం పార్టీని అడ్డుకోగలడా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.