Telanganapolitics: కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించడం రాజకీయ పార్టీ నేతల లక్షణం . కార్యకర్త స్థాయి మొదలు అన్ని వర్గాల బాగోగులను చూడడం పార్టీల ప్రథమ కర్తవ్యం. ఒకదాంట్లో వస్తుంది..మరోదాంట్లో పోతే అంతగా బాధ ఉండదని నేతలు భావిస్తారు. కానీ బీఆర్‌ఎస్‌తోపాటు అన్ని రాజకీయ పార్టీలో ఆదాయాలు నిల్ ..ఖర్చులు ఫుల్ అన్నట్లుగా ఉంది పార్టీల టికెట్ ఆశిస్తున్న ఆశావాహుల పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం ఖర్చు చేసే ఖర్చుల ముందు ఇవ్వేం పెద్ద ఖర్చులు కావని ఆశావాహులు అనుకుంటున్నారు. అయితే ఏడాది..రెండేళ్లుగా కార్యకర్తలు.. నాయకులను..ప్రజలకు ఇదోతికంగా చేయూత అందించిన వారికి నేడు అన్ని రాజకీయ పార్టీల్లో టికెట్లు వచ్చె పరిస్థితి లేదు. రాజకీయాలు చాల ఖరీదయ్యాయి. టికెట్లు వచ్చినా గెలుపు భరోస లేని రాజకీయాలు డబ్బులమయమయ్యాయి..
అధికార పార్టీలో అంటుకున్న అగ్ని జ్వాలలు..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సిట్టింగులకే టికెట్లు ఇవ్వాలనే సవాల్ విసిరారు. ఈ డిమాండ్‌ను కేసీఆర్ ఫాలో అయ్యారా..? ముందస్తుగా సిట్టింగ్‌లకు టికెట్ ఇస్తే.. పార్టీ నుంచి పోయేవారు ఎవ్వరు.. ఉండేవారు తెలుసుకుందామనుకుంటునారా..? సిట్టింగ్‌లపై నియోజకవర్గాల నుంచి వచ్చే వ్యతిరేకతలను పరిగిణలోకి తీసుకొనేందుకా..? తెలియదు కానీ..కేసీఆర్ సిట్టింగులకు 96శాతంగా టికెట్లు ఇచ్చారు. టిక్కెట్ల ఖరారు ప్రకటనల అనంతరం కోదాడ ఎమ్మెల్యేల మల్లయ్య యాదవ్ మాకు వద్దు అంటు ప్రజలు తీర్మానం చేసి కేసీఆర్‌కు లేఖతోపాటు ఆందోళనలు చేశారు. వెలమా ఆహాంకానికి నిలువుఎత్తుగా మల్కాజీగిరి ఎమ్మెల్యే హన్మంతరావు తనతోపాటు తన కుమారుడికి టికెట్ ఇవ్వనుందుకు చేసిన వాఖ్యలు బీఆర్‌ఎస్‌లో వివాదస్పదమయ్యాయి. ఇదే తీరులో సిట్టింగ్‌ను, ఆశావాహులను కాదని కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. కొడంగల్‌లో సిట్టింగ్‌గా రోహిత్‌రెడ్డికి టికెట్ ఇవ్వడంపై మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అలక పూనడంతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది.
నకిరేకల్ లో వేముల వీరేశంకు టికెట్ ఇవ్వక పోవడంపై ఆయన తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుది అదే పరిస్థితి. ఇలాంటి నాయకులంతా గత ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన వారు కావడం గమనార్హం. పెద్దపల్లిలో దశాబ్ద కాలం నుంచి టికెట్ కోసం ఎదురు చూసి టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెందిన నల్ల మనోహర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఇలా చాల నియోజకవర్గాల్లో టికెట్ ఆశించిన ద్వితీయ శ్రేణి నాయకుల్లో చాల ఆసంతృప్తి నెలకొని ఉంది. బీజేపీ విమర్శిస్తున్నట్లుగా బి ఫారాల ఇచ్చె నాటికి చాల మార్పులు ఉండే అవకాశం ఉంటుందని మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పకనే చెప్పారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు రెండుమార్లు అధికారం ఇవ్వలేదు. మూడోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. తొమ్మిదేళ్ల అధికార పార్టీ పాలనలో ప్రభుత్వంపై వచ్చిన కొద్దిపాటి వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా. తెలంగాణలో అధికార పార్టీని ఢీ కొట్టడానికి తామే ప్రత్యామ్నయం అనే భావన హస్తం పార్టీ నేతల్లో ఉంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌కు కలిసోచ్చె అవకాశాలు మెండుగా ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకుల వినిపిస్తున్న మాట. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఉత్సహాం కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ టికెట్ కోసం వేయికిపైగా దరఖాస్తులు రావడం శుభ సూచకం. మరోవైపు చాల మంది సీనియర్లు పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. గీతారెడ్డి, వీహెచ్, జానారెడ్డిలు దూరం పోటీ చేయమని ముందుగా ప్రకటించారు. కానీ ఉత్తమ కుమార్‌రెడ్డి భార్యభర్తులుగా రెండు స్థానాలను పోటీ చేస్తామని దరఖాస్తు చేసుకోవడం, జానారెడ్డి ఇద్దరు కుమారులు పోటీలో ఉంటామని దరఖాస్తులు చేసుకోవడం ఆ పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. వేయి మందిలో నియోజక వర్గానికి ముగ్గురి చొప్పున స్కీనింగ్ కమిటీ ఢీల్లీకి నివేదిక పంపించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. టికెట్ల ప్రకటన అనంతరం కాంగ్రెస్ పార్టీలో ఎంత లొల్లి ఉంటుందనే భావన అందరిలోను ఉంది. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అని అందరికీ తెలిసిందే. ఈ మేరకు టికెట్ల ప్రకటన జరిగితే ఆందోళనలు అధికార పార్టీ కంటే ఎక్కువగా ఉంటాయనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
దిగ్గజాలే.. అభ్యర్థులు..
తెలంగాణలో బీజేపీ పార్టీ బలం మూడో స్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయిన బీజేపీలో మాత్రం పోటీ చేయడానికి దిగ్గజాలు ఉన్నారు. ఎంపిలు బండి సంజయ్, అరవింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, డీకే అరుణ వీరికి తోడు విజయశాంతి లాంటివారు ఉన్నారు. కానీ చాలా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి బీజేపికి బలమైన అభ్యర్థులు లేరనే విమర్శ ఉంది. బండి సంజయ్ స్థానంలో జాతీయ పర్యాటక శాఖ మంత్రికి కిషన్‌రెడ్డికి తెలంగాణ బాధ్యతలు చేపట్టారు. ఇంత మంది దిగ్గజాలు ఉన్న బీజేపీలో చేరికలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. బీఆర్‌ఎస్ నుంచి టికెట్లు రానివారు బీజేపీలోకి వలస వస్తారని పార్టీ ఆశించిన పెద్దగా లాభం కనిపించడం లేదు. కాంగ్రెస్ టికెట్ల ప్రకటన అనంతరం పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల మరీ. కానీ చాల మంది నాయకులు బీజేపీ నుంచి పోటీ చేయాలంటే భయపడుతున్నారు. టికెట్ రాకపోయిన ఫర్వాలేదు కాని.. బీజేపీలోకి పోయి చేతులు కాల్చుకోవడం ఎందుకు అని భావిస్తున్నావారే ఎక్కువగా కనిపిస్తున్నారు. బీజేపీ పార్టీకి చాల నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు. ఉన్న నియోజకవర్గాల్లో ఆశావాహుల సంఖ్య అధికంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే.. అభ్యర్థుల ఖరారు అన్న అంశం ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది.
===========
బొజ్జ రాజశేఖర్ సీనియర్ జర్నలిస్ట్