రసకందాయంలో తెలంగాణ రాజకీయం. మహా పాదయాత్ర తో జనం ముందుకు వస్తున్న కమల దళపతి. తనదైన శైలిలో దూకుడు కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్. మునుపెన్నడూ లేని విధంగా గ్రామాల్లో పర్యటిస్తున్న టిఆర్ఎస్ అధినేత. 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలుపు ఎవరిది?
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో గడీల పాలనను బద్దలు కొట్టేందుకు మహా పాదయాత్రకు తెలంగాణ రథసారథి బండి సంజయ్ సిద్ధమయ్యారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పాదయాత్ర చేపడుతున్నట్లు సంజయ్ ప్రకటించడం చూస్తుంటే.. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పార్టీలు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఓవైపు తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి దూకుడు పెంచడం.. అధికార టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ గ్రామాల్లో పర్యటిస్తూ ఉండడం.. కమల దళపతి పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించడం చూస్తుంటే రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఇటీవల పీసీసీ అధ్యక్షుడుగా నియమితులైన రేవంత్ రెడ్డి.. పార్టీలోని అసంతృప్తులను బుజ్జగిస్తూ.. తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. దుబ్బాక గ్రేటర్ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడడం తో పార్టీ కార్యకర్తలు నైరాశ్యం లో ఉన్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో రెండోవ స్థానంలో నిలిచిన.. పార్టీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరి తయారైంది. కానీ రేవంత్ ఎప్పుడైతే పీసిసిగా ఎన్నికయ్యాడో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయ్యింది. పార్టీ సీనియర్ నేతలను కలుస్తూ.. అధికార పార్టీ మీద తనదైన శైలిలో రెచ్చిపోతూ రేవంత్ కోమాలో కోమాలో ఉన్న పార్టీని తట్టి లేపుతూ కార్యకర్తలు జోష్ నింపుతున్నారు.
మరోవైపు అధికార టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం మునుపెన్నడూ లేని విధంగా గా గ్రామాల్లో పర్యటిస్తూ స్పీడ్ పెంచాడు. అభివృద్ధి కార్యక్రమాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు.
కాగా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫైనల్ కు మూడూ పార్టీలు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న హుజురాబాద్ ఎన్నిక సెమీ ఫైనల్ మ్యాచ్ లాంటిదని.. ఇక్కడ లో గెలిచిన వారికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.