ts: టెన్త్ ఫలితాల్లో మరోసారి బాలికలదే పైచేయి..!!
తెలంగాణ పదోతరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో 90 శాతంమంది ఉత్తీర్ణులైనట్లు ఆమె వెల్లడించారు. మరోసారి బాలికలు సత్తాచాటాడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఫలితాల్లో బాలికలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 87.61 శాతం సాధించారన్నారు. 3007 పాఠశాల్లో విద్యార్థులంతా పాస్ కాగా.. 15 పాఠశాల్లలో ఒక్క విద్యార్థి కూడ పాస్ కాలేకపోయారు. ఫలితాల్లో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. రెండు , మూడు స్థానాల్లో నిర్మల్ , సంగారెడ్డి నిలిచాయి. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల 9 వేల 275 మంది హాజరయ్యారు. ఇక పరీక్షల్లో తప్పిన వారికి బోర్డు ఆగష్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది.