టైలర్ కన్హయ్య లాల్ మర్డర్.. ఉదయపూర్ లో టెన్షన్ టెన్షన్!

Udauipur murder: రాజస్థాన్ టైలర్ కన్హయ్య లాల్ హత్య నేపథ్యంలో ఉదయపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి వందలాది మంది నిరసనకారులు కన్హయ్యకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని వెళ్లగొట్టారు. ఇక కన్హయ్య లాల్ అంతిమయాత్ర సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వేయ్యిమందికి పైగా నిరసనకారులు కాషాయ జెండాలు పట్టుకుని అతని కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

మరోవైపు కన్హయ్య లాల్ పై దాడికి సంబంధించి రియాజ్ అఖ్తరీ తో పాటు గౌస్ మహ్మద్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసును కేంద్ర హెంశాఖ ఎన్ఐఏ(అత్యున్నత ఉగ్రవాద నిరోధక సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ)కి అప్పగించింది. హంతకులు పాకిస్థాన్‌కు చెందిన దావత్-ఏ-ఇస్లామీతో సంబంధాలు కలిగి ఉన్నట్లు.. వారిలో ఒకరు 2014లో కరాచీకి వెళ్లినట్లు ఇన్విస్టిగేషన్ టీం గుర్తించింది.

టైలర్ హత్య కు సంబంధించి పోలీసు అధికారి ఎంఎల్ లాథర్ కీలక విషయాలు వెల్లడించాడు. హత్య పథకం ప్రకారం జరిగిన ఉగ్రదాడి అని.. హంతకులతో పాటు మరికొంత మందికి ఇందులో ప్రమేయముందని లాథర్ తెలిపారు. ప్రధాన నిందితులు దావత్-ఎ-ఇస్లామీ సంస్థతో టచ్‌లో ఉన్నారన్నారు. వారిలో ఒకరు 2014లో పాకిస్థాన్‌లోని కరాచీకి వెళ్లి ఆ సంస్థను కలసివచ్చినట్లు గుర్తించామన్నారు. దీనిని ఉగ్రవాద చర్యగా పరిగణిస్తున్నట్లు ఆయన చెప్పారు. సంఘటనకు బాధ్యులుగా అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ని సస్పెండ్ చేసినట్లు లాథర్ తెలిపారు.
బీజేపీ నేత నూపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో కన్హయ్య లాల్ పోస్టులను పోస్ట్ చేయడంతో..కొంతమంది వ్యక్తులు అతనిని బెదిరింపులకు గురిచేశారు. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.అనంతరం పోలీసులు మధ్య వర్తిత్వం వహించి ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు.ఈనేపథ్యంలోనే తనకు పోలీసుల సహయం అవసరం లేదని కన్హయ్యలాల్ వ్రాతాపూర్వక హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఇక కన్హయ్య లాల్ భార్య జాతీయ మీడియా ఛానల్ మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. బెదిరింపుల రావడంతో కన్హయ్య వారం రోజుల పాటు దుకాణాన్ని మూసివేసినట్లు ఆమె తెలిపారు. పోలీసులు మధ్యవర్తిత్వం వహించిన తర్వాతే.. అతను తిరిగి దుకాణాన్ని ఓపెన్ చేశారన్నారు. ఇంతలోనే ఈఘోరం జరిగిపోయిందని అంటూ కన్నీంటి పర్యంతమయ్యారు.