తెలంగాణకు కరోనా ముప్పు పొంచి ఉంది : డాక్టర్ శ్రీనివాసరావు

రాష్ట్రానికి కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పుపొంచి ఉందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. అందరూ జాగ్రత్తగా ఉండకపోతే కోవిడ్ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం తప్పక పాటించాలని.. పండగలకు పిల్లలు వయోవృద్ధులు దూరంగా ఉండాలని సూచించారు. గత అయిదారు నెలలుగా ప్రజలు జాగ్రత్త పాటించకపోవడమే కేసుల పెరుగుదలకు కారణమని శ్రీనివాస రావు పేర్కొన్నారు. కోవిడ్ కేసుల పెరుగుదలకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.
కరోనా మలిదశ ఉదృతి నేపద్యంలో లాక్ డౌన్ కర్ఫ్యూ వంటి అసత్య ప్రచారాలు నమ్మరాదని ఆయన అన్నారు. ఈ విషయమై లీగల్ పరంగా చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.

Optimized by Optimole