Nalgonda: నెల్వలపల్లి గ్రామ మాజీ సర్పంచ్, బూరుగు పెద మల్లయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని నెల్వలపల్లి గ్రామంలో ఆయన కుమారులు, ప్రణవా గ్రూప్ అధినేత బూరుగు రవికుమార్, ప్రణావా గ్రూప్ డైరెక్టర్ బూరుగు రాంబాబుల వ్యవసాయ క్షేత్రంలో సద్గురు- పీఠాధిపతులు శ్రీ శివానంద స్వామి ఆధ్వర్యంలో ఈ ప్రథమ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. బూరుగు రవికుమార్ ఆహ్వానం మేరకు ఆయన స్నేహితులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ తదితర ప్రముఖులు బూరుగు పెదమల్లయ్యకు నివాళులు అర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.
నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తూ వ్యాపారవేత్తగా పెదమల్లయ్య ఉన్నత స్థాయికి చేరుకున్నారు. తండ్రి స్ఫూర్తితో ఆయన కుమారులు బూరుగు రవికుమార్ కుమార్ స్థాపించిన ప్రణవా గ్రూప్ రియల్ ఎస్టేట్ రంగంలో వినూత్న ప్రాజెక్టులకు కేరాఫ్ అయ్యింది. కేవలం రియల్ ఎస్టేట్ ని వ్యాపారంలా చూడకుండా సమాంతరంగా అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, తెలంగాణలో ప్రణవాగ్రూప్ ఒక ప్రత్యేకతను సాధించుకుంది.
కాగా, పెద మల్లయ్యకు నివాళులు అర్పించిన అనంతరం కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ… పెద మల్లయ్య స్ఫూర్తితో ఆయన కుమారులు రవికుమార్, రాంబాబు గ్రామంలో స్వచ్ఛందంగా సామాజిక సేవ కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు.
కోవిడ్ సంక్షోభ సమయంలో తన స్నేహితుడు రవికుమార్ నిత్యావసర సరుకులు అందించిన సేవ కార్యక్రమాలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గుర్తు చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచే పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ అందిస్తున్న ప్రణవా గ్రూప్ అధినేత బూరుగు రవికుమార్, ఈ సారి కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా ఎంబీబీఎస్ విద్యార్థి అనిల్ కు, వరసగా రెండో ఏడాది రూ. 50 వేలు ఆర్థిక సాయం అందజేశారు.
ఎంపీ రఘువీర్ మాట్లాడుతూ… పెద మల్లయ్య చిన్నప్పటి నుంచి కష్టపడి వ్యాపారవేత్తగా ఎదిగారని, ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చి నిస్వార్థ సేవ చేశారని గుర్తు చేసుకున్నారు.
పెద మల్లయ్య కూతురు సరాబు శోభారాణి, అల్లుడు ప్రభాకర్, బూరుగు సోదరులు, శ్రేయోభిలాషులతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, బీజేపీ నాయకులు డాక్టర్ ఎస్. ప్రకాశ్ రెడ్డి, జె. సంగప్ప, లంకల దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్ రెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.