ఓవైసీకీ కౌంటర్ ఇచ్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయా వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల గడువు ఏడాది సమయం ఉన్నపటికి పార్టీ నేతలు అపుడే సవాళ్లు ప్రతిసవాళ్లతో విరుచుకుపడుతున్నారు.a
ప్రస్తుత ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాథ్ ను మళ్లీ గెలవనివ్వబోమని.. యూపీలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు చేశారు.
కాగా ఒవైసీ సవాల్ ను స్వీకరిస్తున్నామంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 403 ఎమ్మెల్యే సీట్లలో 300 పైగా బీజేపీ గెలుస్తుందంటూ రివర్స్ అటాక్ చేశారు.
‘ఒవైసీ జాతీయ నాయకుడు. ఆయన దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్తుంటారు. ప్రజల్లో ఆయనకంటూ ఒక క్రెడిబులిటీ ఉంది. ఆయన బీజేపీకి సవాల్ విసిరి ఉంటే.. దానిని స్వీకరించేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధమే. వచ్చే ఎన్నికల్లో యూపీలో మళ్లీ బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఏ అనుమానం లేదు. మేం కచ్చితంగా గెలుస్తాం ’ అని యోగి స్పష్టం చేశారు.

Optimized by Optimole