నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. శృతిహాసన్ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. సంక్రాంతి కానుకగా గురువారం చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత బాలయ్య నటించిన మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . మరీ సినీ ప్రేక్షకుల అంచనాలు ఏ మేరకు నెరవేరాయో చూద్దాం ?
కథ :
వీర సింహారెడ్డి (సీనియర్ బాలకృష్ణ) రాయలసీమ క్షేమం కోసం అనుక్షణం పరితపించే వ్యక్తి. పులిచర్ల ప్రాంతాన్నీ కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. అక్కడి ప్రజలు ఆయనను దేవుడిలా కొలుస్తుంటారు. వీరసింహారెడ్డికి సవతి చెల్లి భానుమతి( వరలక్ష్మి) అంటే ప్రాణం. ఎంతలా అంటే ఆమె కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తాడు.కానీ ఆమె మాత్రం పగతో అతని చావు కోసం 30 ఏళ్లుగా వేచి చూస్తుంటుంది. వీరసింహారెడ్డి కొడుకు జయసింహ ( జూనియర్ బాలయ్య) తల్లి మీనాక్షి ( హనీరోజ్) తో కలిసి లండన్లో ఉంటాడు. అనుకోకుండా జయసింహ, ఈషా (శృతిహాసన్) ప్రేమలో పడతాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటారు. ఇంతలో పులిచర్ల నుంచి జయసింహకు పిలుపు అందుతుంది. ఆతర్వాత ఏమైంది? అసలు తండ్రి కొడుకులు ఎందుకు దూరం అయ్యారు? మీనాక్షి పగ చల్లారిందా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!
ఎవరెలా చేశారంటే…?
హీరో బాలకృష్ణ..ఎప్పటిలానే నటన, డ్యాన్స్, యాక్టింగ్ ఈజ్ తో అదరగొట్టారు.రెండు పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ అభిమానులకు అలరించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఎమోషన్ సీన్స్ లో బాలయ్య నటనకు చేతులెత్తి మొక్కుతారు. ఇక హీరోయిన్ శృతహాసన్ తన పరిధి మేరకు నటించి మెప్పించింది. కీలక పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మరో కీలక పాత్రలో నటించిన నవీన్ చంద్ర సైతం ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు పాత్రల పరిధి మేర బాగానే చేశారు.
సాంకేతిక నిపుణులు పనితీరు:
దర్శకుడు గోపిచంద్ మలినేని..అనుకున్న కథను తెరపై ప్రజెంట్ చేయడంలో 100 శాతం సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మాత్రం చిరాకు తెప్పించేలా ఉన్నాయి. ఇక మ్యూజిక్ పరంగా చూసుకుంటే తమన్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చించేశాడు.పాటలు ఒకే అనేలా ఉన్నాయి సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ వర్క్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
మొత్తంగా చూస్కుంటే ఫస్ట్ హాఫ్ మాస్.. సెకండ్ హాఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో సంక్రాంతి కానుకగా అభిమానులను అలరించాడు బాలయ్య.
రేటింగ్: 3/5( సినిమా సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది )