విశాఖ: వారాహి విజయ యాత్రపై నాదెండ్ల సన్నాహక సమావేశం

Janasena: జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  వారాహి విజయ యాత్ర తదుపరి విడత విశాఖపట్నం నగరం నుంచి మొదలవుతుందన్నారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. యాత్ర విజయవంతం చేయడానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో ఆయన  సన్నాహక సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో  నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ “ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ యాత్ర విజయవంతంగా సాగింది. అంతకు మించిన స్థాయిలో విశాఖ నగరంలో చేసే యాత్ర ఉండాలన్నారు. నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా సమష్టిగా పని చేసి వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని  సూచించారు. యాత్రలో భాగంగా జనవాణి కార్యక్రమం విశాఖలో ఉంటుందన్నారు. అదే విధంగా క్షేత్ర స్థాయి పరిశీలనలు చేపట్టి, సంబంధిత ప్రజలతో అధినేత సమావేశమై సమస్యలను తెలుసుకుంటారని నాదెండ్ల అన్నారు. ఈ సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు  కోన తాతారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు , పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

 

Optimized by Optimole