ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ అంతరిక్షంలో అద్భుతం..

భారత్ కి స్వాతంత్య్రం సిద్ధించి నేటితో 75 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్న వేల అంతరిక్షంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఆజాదీ కా అమృతోత్సవంలో భాగంగా..స్పేస్ కిడ్జ్ సంస్థ భూమి నుంచి 30 కిలో మీటర్ల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించింది.

 

కాగా స్పేస్ కిడ్జ్ సంస్థ .. భారత్ లో యువ శాస్త్రవేత్తలను తయారు చేయడంతో పాటు.. పిల్లలకూ విజ్ఞానం పెంపొందించే అంశాలను తెలియజేసేందుకు పాటు పడుతోంది. ఇటీవల ఈ సంస్థ 750 మంది బాలికలు AZadiSAT పేరుతో తయారు చేసిన ఉప గ్రహాన్ని ఆర్బిట్ లోకి ప్రయోగించగా.. సాంకేతిక కారణాల వలన అది విఫలమైంది.

మరోవైపు భారత సంతతికి చెందిన సైంటిస్ట్ రాజాచారి అంతరిక్షం నుంచి దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్పేస్ స్టేషన్ నుంచి తీసిన హైదరాబాద్ ఫోటోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

Optimized by Optimole