ఎర్రకోటపై ప్రధానిమోదీ జాతీయపతాక ఆవిష్కరణ(ఫోటోస్)

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల కలలను సాకారం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ప్రధాని.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
వచ్చే 25ఏళ్ల పాటు యువత దేశ అభివృద్ధి కోసం తమ జీవితాలను అంకితం చేయాలని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి..బానిసత్వం నిర్మూలన..ఘనమైన వారసత్వం..ఏకత్వం.. పౌరహక్కు అనే పంచసూత్రాలపై యువత దృష్టి సారించాలన్నారు.
వరుసగా తొమ్మిదోసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ప్రధాని మోదీ. అంతకుముందు రాజ్ ఘాట్ కు వెళ్లిన మోదీ.. జాతిపిత గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.
ఎర్రకోట చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ‘నో కైట్‌ ఫ్లై జోన్‌’గా ప్రకటించారు. వేడుకలు జరిగే వేదిక వద్దకు ఎలాంటి గాలిపటాలు, బుడగలు, చైనా లాంతర్లు వంటివి రాకుండా చూసేందుకు ప్రత్యేకంగా 400 మంది సిబ్బందిని వ్యూహాత్మక ప్రాంతాల్లో అవసరమైన పరికరాలతో సిద్ధంగా ఉంచారు.
దేశపు మట్టిపై ఉన్న ప్రేమతో స్వాతంత్య్ర సమర యోధులు వీరోచిత పోరాటం చేసి..   మనకు స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టారని ప్రధాని మోడీ గుర్తుచేశారు.
ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట చుట్టూ 10 వేల మంది పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు.
courtesy: PTI