తెలంగాణలో క్లౌడ్ బరెస్ట్ జరిగిందా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన క్లౌడ్ బరెస్ట్ వ్యాఖ్యలపై దుమారం చేలరేగుతోంది. కాళేశ్వరం అవినీతిని కప్పిపించుకోవడానికే ఈవిషయాన్ని తెరపైకి తెచ్చారని ప్రతిపక్ష నేతలు విమర్శల దాడిచేస్తున్నారు. వారంరోజులుగా వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పడు వచ్చి తప్పులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో క్లౌడ్ బరెస్ట్ కు అవకాశం చాలా తక్కువని వాతావరణ శాఖ అధికాలు తేల్చిచెప్పారు.

క్లౌడ్ బరెస్ట్ అంటే ..?
ఆకాశం ఉన్నట్టుండి మేఘావృతమై ఒక్కసారిగా నీటిదారును భూమిపై కుమ్మరించడాన్ని క్లౌడ్ బరెస్ట్ అంటారు. అయితే కేవలం నియమిత ప్రాంతంలో క్లౌడ్ బరెస్ట్ జరిగేందుకు అస్కారముంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. క్లౌడ్ బరెస్ట్ జరిగితే .. 20 నుంచి 30 చ.కి.మీ పరిధిలో, గంటకు 10 సెం.మీ. వర్షపాతం నమోదవుతుందని..దాంతో ఆప్రాంతంలో ఒక్కసారిగా వరదలు వచ్చే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. 10 రోజుల క్రితం అమర్ నాథ్ యాత్రలో ఆకస్మికంగా భారీ వరదలు.. క్లౌడ్ బరెస్ట్ లో భాగంగా జరిగినట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పర్వత ప్రాంతాలు అనుకూలం..

క్లౌడ్ బరెస్ట్ ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో జరిగేందుకు అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనదేశంలో ఉత్తరఖాండ్, హిమాచల్, లడఖ్ లలో ఇలాంటి ఘటనలు జరిగేందుకు అవకాశముందంటున్నారు. ఇప్పటివరకు జరిగిన క్లౌడ్ బరెస్ట్ ఫలితంగా.. భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందంటున్నారు శాస్త్రవేత్తలు. గణంకాల ప్రకారం 1970 నుంచి 2016 వరకు 30 క్లౌడ్ బరెస్టులు సంభవించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

ఇక తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు .. క్లౌడ్ బరెస్ట్ కాదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక్కడ అలాంటి ఘటనలు జరిగేందుకు అవకాశం చాలా తక్కువగా ఉందని స్పష్టం చేశారు.