మంకీపాక్స్ లక్షణాలు ఏంటి..  చికిత్స ఉందా?

మంకీపాక్స్ లక్షణాలు ఏంటి.. చికిత్స ఉందా?

ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన విధ్వంసం మాటల్లో చెప్పలేనింది. తగ్గినట్లే తగ్గి మరో మారు కోరలు చాస్తోన్న మహమ్మారితో..ఇప్పటికీ భయానక వాతావరణం కనిపిస్తోంది. ఈతరుణంలో మంకీపాక్స్ అనే మహమ్మారి వ్యాప్తి దడపుట్టిస్తోంది. ఆఫ్రికాలో జంతువుల నుంచి మనుషులకు సోకిన ఈవైరస్.. దేశంలో కేరళ రాష్ట్రంలో తొలికేసు వెలుగుచూసింది. దీంతో మంకీపాక్స్ పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వైరస్ లక్షణాలు ఏంటి? ప్రాణంతకమా.. తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం!

మంకీపాక్స్ లక్షణాలు:

_ వైరస్ సోకితే చర్మంపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి.
_ జ్వరం, తల నొప్పి, నడుం నొప్పి, కండరాల నొప్పి, వాపు, అలసట వంటివి ఎక్కువగా కనిపిస్తాయి.
_ వైరస్ ఎక్కవగా ఉన్న వారిలో శరీరమంతా పొక్కులు వస్తాయి. వీటి నుండి చీము, రక్తం కారుతుంది.
_ వైరస్ సోకిన వ్యక్తికి 14 నుంచి 21 రోజుల్లో లక్షణాలు బయటపడే అవకాశముంది.

కరోనా మాదిరి సంక్రమిత వ్యాధి :

ఈవైరస్ కరోనా మాదిరి ఒకరి నుంచి మరొకరికి సులభంగా సోకుతుంది. వైరస్ సోకిన వ్యక్తి దుస్తులు, పరుపు తాకడం వల్ల వ్యాపిస్తుంది. దగ్గు, తుమ్ము ద్వారా వైరస్ స్ప్రెడ్ అవుతుంది. మంకీపాక్స్ వివిధ మార్గాల ద్వారా మనుషులకు సోకుతుంది. అయితే ఇది సోకిన వెంటనే దాని ప్రభావాన్ని చూపదు. ఈ వైరస్ మొదట శరీరమంతా వ్యాప్తి చెందుతుంది. కొందరిలో ఏ లక్షణాలూ కనిపించవు.. కానీ, శరీరంపై చిన్న చిన్న సైజుల్లో దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. మంకీపాక్స్ కేవలం కోతుల ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది అనేది అపోహ మాత్రమే.వైరస్ సోకిన ఏ జంతువు, మనిషి నుంచి అయినా వైరస్ స్ప్రెడ్ అయ్యేందుకు అస్కారం ఉంది.

ప్రాణాంతకమా..?
మంకీపాక్స్ తగు జాగ్రత్తలు తీసుకుంటే దానంతంట అదే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం ఇది ప్రాణాంతకం కావొచ్చు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైరస్ మరణాల రేటు 3 నుండచి 6 శాతం వరకు మాత్రమే ఉంది. కొన్ని సార్లు మరణాలు 10 శాతానికి పైగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే మరణాల రేటు పెరగడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

చికిత్స ;
_ కరోనా మాదిరి మంకీపాక్స్ కు సరైన చికిత్స అంటూ లేదు.
_ వైరస్ లక్షణాలను నుంచి ఉపశమనం పొందేందుకు యాంటి వైరల్ మందులు వాడాల్సి ఉంటుంది.
_ వైరస్ సోకిన వ్యక్తిని ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందించాలి.. అంతేకాక అనుమానిత వ్యక్తులను దూరంగా ఉంచడం మేలు.
_ మశూచికి ఇచ్చే టీకాలు వైరస్ పై 85 శాతం వరకు పనిచేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
_ వైరస్ వ్యాప్తి చెందకుండా మాస్క్ , శానిటైజేషన్ ,పరిసరాల పరిశుభ్రత పాటించాలి.

NOTE :  పిల్లలు , పెద్ద అనే తేడా లేకుండా అందరీకి వైరస్ సోకే ప్రమాదముంది. ముఖ్యంగా పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.