భోగి అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు?

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పల్లెటూర్లలో సందడి వాతావరణం కనిపిస్తుటుంది. మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండగలో మొదటి రోజు భోగిగా జరుపుకుంటారు. దక్షిణాయనంలో పడిన కష్టాలు, బాధలను అగ్ని దేవుడుకి ఆహుతి చేస్తూ ప్రజలు భోగి మంటలు వేస్తారు.అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు? పురాణాలు ఏం చెబుతున్నాయి? తెలుసుకుందాం..!

భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి పదం వచ్చింది. దీనికి అర్థం సుఖం.పూర్వం శ్రీ రంగనాథ స్వామి లో గోదాదేవి లీనమై భోగాన్ని పొందడం మూలానా భోగి పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని పురాణాలు చెబుతున్నాయి.అంతేకాక కృష్ణుడు ఇంద్రుడికి పాఠం నేర్పుతూ.. గోవర్ధన్ పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా ఇదేనని పురాణ గాథ.

ధనుర్మాసం అంతటా ఇంటి ముందు ఆవుపేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని భోగి మంటలలో వాడుతారు . భోగిమంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి, మామిడి మేడి మొదలైన ఔషధ చట్ల బెరళ్ళు వేస్తారు. కాలడానికి ఆవు నెయ్యిని జోడిస్తారు ఈ ఔషధ మూలికలు కాల్చడం వలన విడుదలయ్యే గాలి..మానవ శరీరంలోని నాడులను శుభ్రపరుస్తుందని ప్రజల నమ్మకం.
ఇక ఆధ్యాత్మికపరంగా భోగి మంటలను..ప్రజలు అగ్ని దేవుడిగా ఆరాధిస్తారు. ఇందుములంగా మానసిక ఆరోగ్యం, విజయం చేకూరుతుందని నమ్ముతారు.

Optimized by Optimole