దేశంలో బిజెపి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏమిటి? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. ముఖ్యంగా బిజెపి కేంద్రంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉండటం, సగానికి పైగా రాష్ట్రాల్లో పాగా వేయడం మరో పక్క కాంగ్రెస్ పూర్తి బలహీనపడటంతో ఈ చర్చకు ప్రాధాన్యత ఏర్పడిరది. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఒకవైపు, తెలంగాణ సీఎం కేసీఆర్ మరోవైపు ప్రత్యామ్నాయ రాజకీయ శిబిరాల కూర్పుకు యత్నిస్తున్నా బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఢల్లీి సీఎం అరవింద్ కేజ్రీవాల్ అటువంటి యత్నాలతో కలిసి రావటం లేదు. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా అరవింద్ కేజ్రీవాల్ విభిన్న రాజకీయాలకు అఖిలభారత స్థాయిలో గుర్తింపు ఉన్నా ఢల్లీి మార్కు రాజకీయాలనే ముద్రపడిరది. పంజాబ్ గెలుపు తర్వాత హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖాండ్, గుజరాత్ వంటి రాష్ట్రాలపై కన్నేసి కేజ్రీవాల్ కొత్త ఆశలు రేకెత్తిస్తున్నారు. అటు పూర్తి రాష్ట్రం, ఇటు కేవలం కేంద్రపాలిత ప్రాంతం కాకుండా ఉన్న ప్రత్యేక హోదా ఢల్లీిది. అర్బన్ ఓటర్లను ఆకట్టుకునే కేజ్రీవాల్ ఢల్లీి బయట నెగ్గుకురాలేరన్న వాదనను పక్కకు నెట్టి, పంజాబ్‌లో భారీ మెజార్టీతో గెలవటం ‘ఆప్’ కి అవకాశం మాత్రమే కాదు ఒక సవాల్‌గా కూడా మారింది. మిగతా రాష్ట్రాలకు ‘ఆప్’ విస్తరించడానికి గల రాజకీయ అవకాశాలకు పంజాబ్‌లో వారు అందించే పాలన ఒక ప్రయోగశాల వంటిది. అక్కడ ఆరు నెలల ఆప్ పాలన ఇప్పుడు రాజకీయ సమీక్షకు నిలవాల్సి వస్తోంది.
దేశ రాజధాని ఢల్లీి శాసనసభ ఎన్నికల్లో బిజెపిని మట్టికరిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ నేతృత్వంలో ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ‘ఢల్లీి మోడల్’ పాలనను ప్రచారం చేసి పంజాబ్‌లో కాంగ్రెస్‌ను ఓడిరచి అధికారం చేపట్టింది. ఇదే ఊపును ఇతర రాష్ట్రాలలో కూడా కొనసాగించాలని పాచికలు వేస్తుంది. త్వరలో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సంసిద్ధమవుతోంది. పంజాబ్ ప్రభుత్వ పనితీరును ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలలో ప్రచారం చేసి లాభపడాలని యత్నిస్తుంది. పగ్గాలు చేపట్టిన ఆరు నెలల్లోనే ఆప్ ప్రభుత్వం పంజాబ్‌లో అనుకున్నది సాధించిందా అని పరిశీలిస్తే ఇంత తక్కువ సమయంలో సాధించిన ప్రగతిని, లోటుపాట్లను బేరీజు వేయడం తొందరపాటే అవుతుంది.
పంజాబ్ ఎన్నికల్లో ఆప్ 117 అసెంబ్లీ సీట్లలో 92 సీట్లు సాధించి భారీ విజయంతో కాంగ్రెస్, అకాలీదళ్, బిజెపి పార్టీలకు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత రాష్ట్రంలో ఆప్‌కు కలిసివచ్చింది. ఎన్నికల్లో అనేక హామీలిచ్చింది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని, మాఫీయా రాజ్యాన్ని, డ్రగ్ వ్యవస్థను అరికట్టడంతోపాటు వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసి పంజాబ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని ఆప్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ‘ఢల్లీి మోడల్’ను ముఖ్యంగా ఆరోగ్య, విద్యా రంగాలలో సాధించిన అభివృద్ధిని ఇక్కడ ప్రచారం చేసింది. యువతను ఆకట్టుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించడంతోపాటు ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తామని, ప్రతి మహిళకు వెయ్యి రూపాయలు ఇస్తామనే కీలకమైన హామీలిచ్చింది.
ఆప్ హామీల అమలు తీరు..
భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆధ్వర్యంలోని ఆప్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి పలు చర్యలు తీసుకుంటుంది. మాన్ ప్రభుత్వం తొలి చర్యగా అవినీతిని అరికట్టడానికి ఒక హెల్ప్‌లైన్ నెంబరును ఏర్పాటుచేసింది. లంచం అడిగేవారికి సంబంధించి ఆడియో/వీడియో రికార్డులను సోషల్ మీడియాలో ప్రచారం చేసేవిధంగా వాట్సాప్ నెంబరు ఇచ్చారు. దీనికి స్పందనగా అనేక రికార్డులు వైరల్ అవ్వగా చర్యలు తీసుకోబడిన ప్రముఖులలో స్వయంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింఘాల్ కూడా ఉన్నారు. విచారణ అనంతరం మంత్రిని భర్తరఫ్ చేసిన ముఖ్యమంత్రి ఆయనను అరెస్టు చేయించారు. ఈ చర్య నూతన శకానికి నాందిగా వర్ణించిన కేజ్రీవాల్ ఆప్ ప్రభుత్వం ఏ స్థాయిలోనైనా అవినీతిని సహించదని అన్నారు. అయితే ప్రస్తుతం మరో ఆప్ మంత్రి కూడా స్టింగ్ ఆపరేషన్‌లో అవినితీకి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కోవడం ఇక్కడ గమనార్హం.
‘విఐపి’ సంప్రదాయాన్ని తొలగిస్తామని ప్రకటించిన ఆప్ ప్రభుత్వం మొదటి విడతలో మాజీ ప్రజాప్రతినిధులతో సహా 424 మందికి వ్యక్తిగత భద్రతా సిబ్బందిని తొలగించింది. ఈ రక్షణ సిబ్బందిని రాష్ట్రంలో శాంతి భద్రతలకు, అవినీతిని అరికట్టడానికి వినియోగిస్తామని తెలిపింది. అయితే భద్రతా సిబ్బందిని తొలగించిన తర్వాత ప్రముఖ పంజాబ్ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య జరగడంతో ఆప్ ప్రభుత్వం పాక్షికంగా ఈ నిర్ణయంపై వెనకడుగు వేసింది. ఇక ఉద్యోగాలకు సంబంధించి తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగులను క్రమబద్ధీకరించింది, ఉద్యోగ ప్రకటనలు ఇచ్చింది. అయితే హామీ విచ్చిన విధంగా జీతభత్యాలను ప్రకటించలేదు. యూనివర్సిటీలు, కాలేజీలలోని లెక్చరర్లు ఏడవ వేతన సంఘం సిఫార్సులు అందించారు. సేవా రంగానికి ఢల్లీిలో చేసినట్టు పంజాబ్‌లో కూడా అనేక మోహల్లా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు, ప్రభుత్వ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేశారు.
డ్రగ్స్ అంశాన్ని పరిశీలిస్తే ఈ కేసుల్లో భాగస్వాములైన అధికారులతో సహా వేల మందిని అరెస్టు చేయడంతో క్షేత్రస్థాయిలో కొంతమేర పరిస్థితులలో మార్పు కనిపిస్తుంది. ఇక ఆర్థిక రంగాన్ని సమీక్షిస్తే ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు భారం ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడిరది. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహంలో భాగంగా ముఖ్యమంత్రి మాన్ జర్మనీ పర్యటించినా ఆశించినమేరు మేలు జరగలేదు. రాష్ట్రానికి వెన్నుముఖ లాంటి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా పెసరపప్పు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించడంతో రైతులకు సంవత్సరంలో మూడవ పంట వేసే అవకాశం దక్కింది. మరో ఆసక్తికరమైన అంశం ఆప్ ప్రభుత్వం ప్రచారానికి పెద్దపీట వేస్తుంది. వార్త పత్రికలలో ప్రకటనలు ఇవ్వడం, సోషల్ మీడియాతోపాటు ఇతర మీడియా వేదికలలో ఆప్ అనుకూల వీడియోలను, ట్విట్‌లను పెద్దఎత్తున పోస్టు చేస్తూ ప్రచారాన్ని చేసుకుంటుంది.
బిజెపి కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో చేసినట్టు పంజాబ్‌లో కూడా ఆప్ ఎమ్మెల్యేలను పార్టీ మారేలా ప్రోత్సాహిస్తుందనే వార్తలు రాష్ట్రంలో దుమారం లేపాయి. దీంతో ప్రభుత్వ బల నిరూపణకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని గవర్నర్‌ను కోరగా ఆయన న్యాయ సలహా మేరకు తిరస్కరించారు. అయితే ఆప్ ప్రభుత్వం పనితీరుతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని, ఆ ప్రభుత్వాన్ని ఓడిరచేందుకు వారే సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్, బిజెపి వాదిస్తున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తరఫున గెలిచిన 20 ఎమ్మెల్యేలలో సగం మంది, 2014లో గెలిచిన నలుగురు ఎంపీలు పార్టీ ఫిరాయించారు. ఈ సారి అటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఆప్ జాగ్రత్తపడిరది.
కేజ్రీవాల్ చేతుల్లో పాలన..
రాష్ట్రంలోని మాన్ ప్రభుత్వం కేజ్రీవాల్ చెప్పుచేతుల్లో ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పంజాబ్ రాష్ట్ర నిధులను, వనరులను ఇతర రాష్ట్రాలో ఆప్ విస్తరణకు దుర్వినియోగపరుస్తున్నారనే విమర్శలున్నాయి. అంతేకాక ముఖ్యమంత్రి మాన్ స్వహతగా తనను తాను నిరూపించుకోలేకపోతున్నారు. ఢల్లీిలో ఉండే పంజాబ్ రాజకీయవేత్త రాఘవ చద్దా రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యులుగా ఉన్నా ఆయన ఆప్ ఢల్లీి దర్బార్ ప్రతినిధిగా ప్రచారం జరుగుతోంది. అంతేకాక ప్రభుత్వం తీసుకునే ప్రధాన నిర్ణయాలపై కేజ్రీవాల్ ప్రభావం కూడా ఉండడంతో ఈ విమర్శలకు తావిస్తుంది. దీంతో పార్టీ పంజాబ్ నుండి పర్యావరణ, సామాజిక కార్యకర్తలు ఇద్దరిని రాజ్యసభకు నామినేట్ చేసింది.
ఎదురవుతున్న సవాలు..
రాష్ట్రంలో పార్టీకి కొన్ని అంశాలలో ఎదురుదెబ్బలు తగిలాయి. ముఖ్యమంత్రి మాన్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఆ ఉప ఎన్నికల్లో సిక్కు వేర్పాటువాద అకాలీ దళ్ (అమృత్‌సర్) నేత సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ సంగ్రూర్ గెలవడం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బ. దీంతోపాటు అకల్ తాకత్ జాతేదార్ సిక్కు యువతను మత విశ్వాసం పరిరక్షణకు ఆయుధాలను చేపట్టాలని పిలుపివ్వడం, బింద్రన్‌వాలే పోస్టర్ల బహిరంగ ప్రదర్శన, ‘బండి`సిక్కులను’ విడుదల చేయాలని అకాలీదళ్ డిమాండ్ చేయడం వంటిని ఆప్ ప్రభుత్వానికి సమస్యాత్మకంగా పరిణమిస్తున్నాయి. సిక్కు వర్గాలను సంతృప్తిపరచ్చడానికి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. సరిహద్దుల అవతల నుండి డ్రోన్ ద్వారా జారవిడుస్తున్న ఆయుధాలు, నకిలీ కరెన్సీ, డ్రగ్స్ సరఫరా వంటి అంశాలు శాంతి భద్రతల లోపాలను ఎత్తి చూపుతున్నాయి. పంజాబ్ పోలీస్ ఇంటలీజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై రాకెట్ గ్రైనేడ్‌తో దాడి దేశ సరిహద్దు వెంట ఉద్రిక్తలతోపాటు దేశ, రాష్ట్ర భద్రతలపై ప్రభావం పడనుంది. నూతన ఆప్ ప్రభుత్వానికి ఇవి సవాలుగా నిలుస్తున్నాయి. వీటిని అరికట్టడానికి రాష్ట్ర భద్రతా దళాలను సన్నద్ధం చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు పొందడం ఎంతో కీలకం. పంజాబ్ ఆర్థిక వ్యవస్థను, భౌగోళిక సరిహద్దులను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సహాయసహకారాలు ఎంతో అవసరం. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.
రాజకీయంగా కేంద్రంలోని బిజెపితో పోరు, పంజాబ్‌లో హామీలు నెరవేర్చి ఫలితాలు సాధించడానికి కేంద్రంతో సయోధ్య ‘ఆప్’కు కత్తిమీద సాము వంటిదే! బిజెపి – కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా నిలవాలనుకుంటున్న ఏ ఇతర రాజకీయపార్టీ రెండు రాష్ట్రాల్లో అధికారంలో లేదు. ఆ ప్రత్యేకత ‘ఆప్’ కే వుంది. పైగా రేపు గుజరాత్ అసెంబ్లీ ఫలితాల తరువాత ఎన్నికల కమీషన్ ఆప్‌కు జాతీయ పార్టీ హోదా కల్పించడం ఖాయం. ఈ పరిస్థితుల్లో … ఆప్ తన భవిష్యత్ రాజకీయ విస్తరణకి పంజాబ్ ప్రయోగశాల నుంచి ఏ సక్కెస్ ఫార్ములాను తీసుకువస్తుందో కాలమే నిర్ణయించాలి.
– ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ.