సోమావతి అమావాస్య అంటే ఏమిటి?ఆ రోజు ఏం చేయాలి?

Somavathiamavasya: సోమావతి అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యగ్రహణములతో సమానమైన ఈ అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.

సోమావతి అమావాస్య రోజు ఆచరించవలసినవి:  

_ పేదవారికి అన్నదానాలు చేయాలి మౌనవ్రతం చేస్తే ఎంతో ఫల ప్రదం.

_ శివరాధన చేసి 108 సార్లు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి.

_ శని మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణ మూర్తిని ఆరాధించాలి.

_  త్రివేణి సంగమం లేదా ఏదైనా పుణ్యా నదులలో స్నానమాచరిస్తే ఐశ్వర్యం కలగడంతో పాటు రోగాలు బాధలు తొలగిపోతాయి.

_  శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణని, పార్వతి పరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి.

పురాణ కథ: సోమావతి అమావాస్య గురించి  ప్రాచుర్యంలో ఉన్న కథ. పూర్వం ఒక ఊర్లో ఓ వర్తక వ్యాపారి ఉండేవాడు. అతనికి వివాహమైన ఏడుగురు కుమారులు పెళ్ళికాని కుమార్తె ఉండేవారు. అనుకోకుండా ఓ రోజు  వ్యాపారింటికి సాధువు అతిథిలా వచ్చాడు. అతిథ్యం స్వీకరించిన అనంతరం పెళ్లికాని కుమార్తె.. ఆ సాధువుకు ప్రణామం చేయగా దీవించకుండా వెళ్లిపోయాడు. వెంటనే  ఆందోళనతో ఆ వ్యాపారి కుమార్తె జాతకాన్ని పురోహితుడికి చూపిస్తాడు. జాతకం చూసిన పురహితుడు అమ్మాయికి పెళ్లి అయితే భర్త వెంటనే చనిపోతాడని చెప్పగా.. సాధువు పరిష్కారం అడుగుతాడు. సింఘాల్ ప్రాంతానికి వెళ్లి చాకలి స్త్రీ కుంకుమ అడిగి నుదుట పెట్టుకుంటే దోషం పోతుందని పురోహితుడు పరిష్కారం చెప్తాడు. ఇక మర్నాడు సోదరితో కలిసి వ్యాపారి చిన్న కుమారుడు సింఘాల్ ప్రాంతానికి బయలుదేరుతాడు. మార్గం మధ్యలో నది దాటాలసి రావడంతో కొద్దిసేపు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటారు. అయితే చెట్టుపై ఉన్న రాబందు గూడులోని పిల్లలను పాము  తినడాన్ని గమనించిన ఆ అమ్మాయి..వెంటనే పామును చంపేస్తుంది.దీంతో సంతోషించిన రాబందు జంట వాళ్ళు నది దాటడానికి సహాయం చేస్తారు. అనంతరం రావి చెట్టు 108 సార్లు ప్రదక్షిణాలు చేసిన ఆ అమ్మాయి నుదుటన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. అంతటితో అమ్మాయి జాతక దోషం తొలగిపోతోంది.

 

 

Optimized by Optimole