‘ మాతృ’ భూమిని.. భాషను మరిచిపోతే ఏం లాభం?

నేను పుట్టిపెరిగిన మ‌ట్టి భాషను 

ఒక‌వేళ నేను మ‌ర‌చిపోతే,

నా జ‌నాలు పాడుకునే పాట‌ల‌ను

ఒక‌వేళ నేను మ‌ర‌చిపోతే,

నాకు క‌ళ్లూ చెవులూ ఉండి ఏం లాభం?

నాకు నోరుండి ఏం ప్ర‌యోజ‌నం?

నా మ‌ట్టి ప‌రిమ‌ళాన్ని

ఒక‌వేళ నేను మ‌ర‌చిపోతే,

నా మ‌ట్టి కోసం నేనేమీ చేయ‌క‌పోతే,

నాకు చేతులుండీ ఏం ఉప‌యోగం?

నేనీ ప్ర‌పంచంలో దేనికి బ‌తుకుతున్న‌ట్లు?

నా భాష పేద‌ద‌ని, బ‌ల‌హీన‌మైన‌ద‌ని

అనుకోవ‌డం ఎంత వెర్రిత‌నం?

నా త‌ల్లి తుదిప‌లుకులు

ఎవెంకీ మాట‌లైన‌ప్పుడు!

ఎవెంకీ మూలం: అలితెత్ నెమ్తుష్కిన్‌

తెలుగు స్వేచ్ఛానువాదం: ప‌న్యాల జ‌గ‌న్నాథ‌దాసు

 

Optimized by Optimole