– వ్యాక్సినేషన్ ప్రక్రియలో కనిపించని ముఖ్యమంత్రి
– వ్యాక్సినేషన్పై ఎటువంటి ప్రకటన లేదు
కరోనా మహమ్మారి నిరోధానికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ కనిపించకపోవడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రధాని మోడీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉత్సాహంగా పాల్గొంటుంటే కేసీఆర్ ఎక్కడ కనిపించకపోవడం.. వ్యాక్సినేషన్పై ఎటువంటి ప్రకటన చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాడు అసెంబ్లీ సాక్షిగా వైద్య నిపుడికి మల్లే పారసీటామల్ డైలాగు పేల్చిన ముఖ్యమంత్రి.. నేడు టీకా విషయంలో అదే అలసత్వం ప్రదర్శిస్తున్నారు.
కాగా ముఖ్యమంత్రుల పనితీరుపై ఇటీవల ఏబీపీ నిర్వహించిన సర్వేలోను వరెస్ట్ సీఎం జాబితాలో కేసీఆర్ నాలుగో స్థానంలో నిలవడంతో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
ఇక దుబ్బాక జీహెచ్ఎంసి ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు .. కేసీఆర్ బాధ్యత రాహిత్యంమైన పోకడలు పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు మింగుడుపడడం లేదన్న వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.