తెలంగాణలో తొమ్మిదియేండ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 130 సంవత్సరాల సుదీర్ఘ చరిత ఉంది. 75 సంవత్సరాల స్వాతంత్ర భాతర దేశంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్ దక్కింది. నాటి ఇందిరమ్మ కాలం నుంచి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వరకు ప్రజలు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం చూపించారు. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో నేడు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల వరకు కుమ్ములాటలు తార స్థాయికి చేరుకున్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించిన సీనియర్ నాయకులుగా ఉన్నా..గులాం నబీ అజాద్, కపిల్ సింబాల్ నాయకులు పార్టీకి రాజీనామాలు చేసి బయటకు వెళ్లి పోయారు. వైఎస్ అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి నేడు సీనియర్లమని చెప్పుకుంటున్న నాయకులు ప్రజల్లోకి అధికారం చేజిక్కించుకోలేకపోయారు. పార్టీకి కొత్త ఊపు తీసుకరావాలని కాంగ్రెస్ అధిష్ఠానం మల్కాజిగరి నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డికి టీపీసీసీ పగ్గాలు అప్పగించింది. యువకుడిగా వచ్చిన రేవంత్‌రెడ్డిని అభినందించాల్సిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు అలకలు, వెన్నుపోట్లు, కుమ్ములాటలాటకు కారకులుగా కారమవుతు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ పదవి అశించిన కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీకి ద్రోహం తలపెట్టి పక్కపార్టీ జెండాను ఎత్తుకున్నారు. చివరకు మనుగోడులో ఓటమిని మూటగట్టుకున్నారు. కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్న కోటమిరెడ్డి వెంకటరెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. మిగిలిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పార్టీ పెద్దకు వ్యతిరేకంగా వ్యహరించడంతో పాటు సూటి పోటి మాటలతో మాట్లాడుతుండడంతో పార్టీలో అంతర్గత ముసలం కొనసాగుతూ వస్తుంది. చివరకు టి కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహణకు పార్టీ అధిష్ఠానం 108 మందితో జంజో కమిటీలను ప్రకటించింది. నిన్న మొన్నటి వరకు టీపీసీసీ అధ్యక్షుడిపై అంతర్గతంగా కొనసాగుతున్న వ్యతిరేకత కమిటీల ఏర్పాటుతో ఒక్కసారిగా బహిర్గతమయ్యింది. కమిటీలో సముచిత స్థానం లభించలేదని కొందరు రాజీనామా చేశారు. మిగిలిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సెవ్ కాంగ్రెస్ పేరుతో అధ్యక్షడికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం, మీడియా ముందు మాట్లాడడంతో అధిష్ఠానం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. 108 మంది సభ్యులతో వేసిన కమిటీలో 50 మందికిపైగా టీడీపి నుంచి వచ్చిన వారికి పార్టీలో ఉన్నత పదవులు ఇచ్చారని సీనియర్లు ఆరోపణలు చేశారు. దీంతో అధిష్ఠానం డీగ్గీ రాజా దిగ్వజయ్‌సింగ్‌ను రంగంలోకి దింపింది. ఆయన సీనియర్లతో పోన్లో మాట్లాడడం, స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అధిష్ఠానికి ఒక నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో ఎవ్వరిపై ఎలాంటి చర్యలు ఉంటాయి..? ఎవ్వరికి పెద్ద పీఠ వేస్తారు..? ఎవ్వరిని మందలిస్తారు..? ఎవ్వరిని పిలిపించుకుకొని మాట్లాడుతారు..? అనే సందేహాలు సీనియర్ కాంగ్రెస్ నాయకులతోపాటు రేవంత్‌రెడ్డి వర్గంలోను నెలకొంది. అధిష్ఠానం నిర్ణయాలపైనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అధారపడి ఉండనుంది.
అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూపుల్లో సీనియర్, జూనియర్లు..
‘సేవ్ కాంగ్రెస్’ పేరుతో సీనయర్ కాంగ్రెస్ నాయకులు పెట్టిన పంచాయితీకి అధిష్ఠానం ఒక్కసారిగా ఉల్కి పడిరది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకమార్‌తోపాటు బట్టి విక్రమార్క, మహేశ్వర్‌రెడ్డి, జగ్గారెడ్డి ,దామోదర రాజా నర్సింహ, మధు యాష్కి గౌడ్, కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావులు జి -9 నాయకులుగా సేవ్ కాంగ్రెస్ కుంపటికి తెర లేపారు. అసలు కాంగ్రెస్ నాయకులను మరిచి టీడీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇప్పించకున్నారని రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేశారు.వీరితో తాము అశించిన పదవులు రాలేదని బెల్లంనాయక్, కొండ సురేఖ రాజీనామాలు చేశారు. ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఆరోపణలకు రేవంత్‌రెడ్డి వర్గంలో 12 మంది పార్టీ పదవులకు రాజీనామా చేశారు. వీరితో ఎమ్మెల్యే సీతక్క కూడ ఉన్నారు. కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేల చొప్పున రెండుమార్లు ఇతర పార్టీల తీర్థం పుచ్చుకున్న ఘనత ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది సంవత్సరాల నుంచి సాధించిన ప్రగతి అంటు ఏది లేదు. తిలా పాపం తలా పిడికేడు అన్నట్లగా అందరు పార్టీ నాయకులు పార్టీ శ్రేయస్సుకు కృషీ చేయకుండ పార్టీకి ఏదో రూపంలో ద్రోహం చేస్తూ వచ్చారు. తెలంగాణలో రెండోస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయిన కాంగ్రెస్‌ను బతికించడానికి అధిష్ఠానం చేసిన ప్రయత్నాలకు సీనియర్లుగా అడుగడుగా అడ్డుపడుతూ వస్తున్నారు. చివరకు పార్టీని రాష్ట్రంలో ప్రస్తుత దీన స్థితికి తీసుకవచ్చారు. దీల్లీ నుంచి డీగ్గిరాజా వచ్చి అందరిని సముదాయించాల్సిన అవసరం ఏర్పడిరది. ఆయన ముందే గాంధీ భవన్‌లో గల్లాలు పట్టుకొని కొట్లాడుకోవడంతో పార్టీపై ప్రజల్లో ఇక.. వీరు మారరు అనే సంకేతాలు వెళ్లాయి. చివరకు చాల మంది కాంగ్రెస్ ఆశావాహులు పక్క పార్టీల దిక్కు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సీనియర్ల చర్యలకు చలించిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి తన అనుచర వర్గంతో కొత్త పార్టీ పెడుతున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ ఏపీ గతి తెలంగాణకు పట్టె పరిస్థితి ఏర్పడనుందనే వాదనాలు ఉన్నాయి.
సీనియర్ల జూనియర్ల మధ్య సీట్ల సయోద్యతో కుమ్ములాలు సద్దుమణిగేనా..
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఇప్పుడు పార్టీని బతికించడానికి, సీనియర్లను సంతృప్తి పరుచడానికి ఎలాంటి చర్యలు తీసుకోనున్నారనే అంశంపై అందరిలో ఒకింత ఉత్కంఠ నెలకొంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పోరు ఉండేది. అప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒక్కరి మాట ప్రకారమే కాకుండా అధిష్టానం సీనియర్లుగా ఉన్న కాంగ్రెస్ దిగ్గజాలకు ఆ జిల్లాలకు సంబంధించిన నియోజక వర్గాలకు టికెట్లు ఇచ్చి సంతృప్తి పరిచేవారు. ఈ కోవలో నెదురువల్లి, దాసరి నారాయయణరావు, జైపాల్‌రెడ్డి, డి,శ్రీనివాస్ వంటి నాయకులు తమ జిల్లాల్లోని కొన్ని అసెంబ్లీ స్థానాల టికెట్లను తీేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు అధిష్ఠానం ఇదే పార్ములాను మళ్లీ తెరపైకి తీసుకరానుందనే వాదనలు వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి వర్గానికి సింహ భాగంగా టకెట్లు కేటాయించి పార్టీలో సీనియర్లుగా తిరుగుబాట బావుట ఎగరవేసిన వారికి వారి జిల్లాలో కొన్ని టికెట్లు కేటాయిస్తారనే వాదన వినిపిస్తుంది. కాదంటే సీనియర్లు కోరినట్లుగా పార్టీ పదవులు ఇవ్వడం చేస్తారని ప్రచారం జరుగుతుంది. చివరగా ఇదే కమిటీలను కొనసాగిస్తామని.. ఉన్న
వాళ్లు ఉండవచ్చునని ఉండని వాళ్లు వెళ్లిపోచ్చు అనే కఠిన నిర్ణయం తీసుకునే అస్కారం కూడ ఉందని చెప్పుతున్నవారు కూడ ఉన్నారు. సీనియర్లుగా ఇంతగా ఆయనను వ్యతిరేకిస్తున్న రేవంత్‌రెడ్డి ఒక్కసారి కూడ అందరిని కలుపుకుపోవడానికి ప్రయత్నాలు చేయలేదనే వాదనలు ఉన్నాయి. సీనియర్ల అలోచనలు, అనుభవాన్ని రేవంత్‌రెడ్డి వాడుకుంటే ఈ పంచాయతీ వచ్చి ఉండేదికాదని ఆయనకు సూటిగా ప్రశిస్తున్నవారు ఉన్నారు. ఇప్పుడు సీనియర్లు సర్దుక పోతారా..?లేదా రేవంత్‌రెడ్డి తన ఒంటెద్దు పోకడకు తిలోకాలు ఇచ్చి పార్టీ అధిష్ఠానం అదేశాల మేరకు అందరిని సమన్వయం చేసుకొని ముందకు సాగుతా..? అనే సంశయాలు అందరిలో నెలకొన్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న రీతిలో ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరువు పూర్తి పోయింది. ఇప్పుడు ఎవ్వరు తగ్గుతారు.. ఎవ్వరు నెగ్గుతారు అనే అంశంపై అందరి దృష్టి నెలకొంది. చివరకు అధిష్ఠానం చేపట్టనున్న చర్యలపై తెలంగాణలో పార్టీ భవిష్యత్తు అధారపడి ఉంటుంది.
– బొజ్జ రాజశేఖర్,
పీపుల్‌పల్స్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి