Kavita: ఔర్ ఏక్ దక్క…BC బిల్లు పక్కా..కవితకు యాదవ సంఘం మద్దతు..!!

MLCkavita:

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయాలన్న డిమాండ్ తో ఈ నెల 17వ తేదీన తెలంగాణ జాగృతి తలపెట్టిన రైల్ రోకో నిరసన కార్యక్రమానికి జాతీయ యాదవ హక్కలు పోరాట సమితి, సోమవన్షి ఆర్య క్షత్రియ సమాజ్ ఉన్నతి మండల్ సంఘాలు మద్ధతు ప్రకటించాయి.

ఈ మేరకు యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, సోమవన్షి ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షుడు చంద్రకాంత్ చవాన్ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి మద్ధతు లేఖను అందజేశారు. ఔర్ ఏక్ దక్క…BC బిల్లు పక్కా అంటూ యాదవ సంఘం నేతలు నినాదాలు చేశారు. రైల్ రోకోలో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత నాయకత్వంలో జరుగుతున్న బీసీ పోరాటంలో జరిగే అన్ని పోరాటాల్లో పాల్గొంటామని, ఎమ్మెల్సీ కవితకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.

Optimized by Optimole