అలీతో చేయను సారీ సర్..?
నటుడు కమెడియన్ ప్రొడ్యూసర్ యాంకర్ అలీ అంటే తెలుగు అభిమానులకు సూపరిచితం. స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహరాజ్ రవితేజ సినిమాల్లో అయితే అలీ తప్పక ఉండాల్సిందే. దర్శకులు స్పెషల్ ఇంట్రెస్ట్తో అతనికి ఓ క్యారెక్టర్ డిజైన్ చేస్తారు. ముఖ్యంగా దర్శకుడు పూరిజగన్నాద్.. అతని సినిమాలో అలీ చేసే పాత్ర కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. అలాంటి అలీతో ఓసినిమాలో నటించడానికి
అప్పటి ఓ స్టార్ హీరోయిన్ విముఖత చూపించింది. ఇది గాలి వార్త అనుకునేరు! మీరు విన్నది సాక్ష్యాత్తు ఆచిత్ర దర్శకుడు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంతకు ఎవరా దర్శకుడు? ఏమిటా కథ అనుకుంటున్నారా ?
ఎస్వీ కృష్ణారెడ్డి ,అలీ అంటే టక్కున గుర్తొచ్చే సినిమా యమలీలా. అప్పట్లో అచిత్రం ఓ సెన్సేషన్. అలీ , ఇంద్రజ హీర,హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రంలో సౌందర్య ఓ స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెల్సిందే.
అమ్మ కోసం ఓ కొడుకు పడే తపన, ఆరాటం.. యముడు, చిత్ర గుప్తుడు యమలోకం నుంచి భూలోకానికి వచ్చి వారు పడే కష్టాలు , మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు అభిమానులను కడుపుబ్బా నవ్విస్తాయి. సినిమా మధ్యలో ‘ చినుకు చినుకు వన్నెలతో చిటపట చిరు సవ్వడితో ‘ వచ్చే రైన్ సాంగ్ సినిమాకే హైలెట్. ఈ సాంగ్ లో సౌందర్య, అలీ జోడి ఒకరిని మించి మరొకరు నటించారు. మొదట ఈ సినిమాకి సౌందర్య హీరోయిన్గా అనుకోవడం అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ అలీకి మొదటి చిత్రం కావడం, సౌందర్య అతనితో నటించనని చెప్పారు. అయితే దర్శకుడి మనసు నొప్పించలేక సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తానని మాటిచ్చారు సదరు హీరోయిన్. చేసేదిమిలేక హీరోయిన్గా ఇంద్రజను తీసుకున్నారు చిత్ర యూనిట్. ఆతరువాత సినిమా విడుదలవడం, అంచనాలను మించి హిట్టవడం అందరికి తెలిసిందే. సినిమాలో అలీ పలికే ‘అక్కుమ్ బక్కుమ్’ డైలాగు ఇండస్ట్రీలో అతనికి ఓ మార్కును సెట్ చేసింది. అందుకే కాబోలు అలీ వచ్చాడంటే చాలు తన మార్క్ డైలాగులతో నవ్వులు పూయిస్తాడు.