యువత ఒక నెంబర్ కాదు… డిసైడర్‌..!!

Telangana: తెలంగాణలో ఎన్నిక‌ల గ‌డువు ముంచుకొస్తుంది. రానున్న ఎన్నిక‌ల్లో యువ‌త కీల‌క‌పాత్ర పోషించే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.  ఈ నేప‌థ్యంలో విధాత పోలిటిక‌ల్‌ క‌న్సల్టెన్సీ.. రానున్న ఎన్నిక‌ల్లో యువ‌త పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వ‌హించారు.ఈ కార్య‌క్ర‌మానికి  ముఖ్య అతిథులుగామోటివేషనల్‌ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్ర,  శాతవాహన యూనివర్సిటీ సోషల్‌ సైన్స్ డీన్  ప్రొఫెసర్ సూరేపల్లి సూజాత , సీనియర్  జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు నేలంటి మధు  , ఓ యూ JAC వ్యవస్థాపక సభ్యులు శ్రీనివాస్ కోట, విధాత ఫౌండర్ రాజు జనగాం ,విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

ఈ సందర్భంగా విధాత ఫౌండర్ రాజు జనగాం  మాట్లాడుతూ… యూత్ ఒక నెంబర్ కాదు. డిసైడర్‌ అన్నారు. ఒక లీడర్ వేవ్ వచ్చిందంటే అది ఒక ఏమోషన్ … దీనిని రాజకీయ నాయకులు వాడుకుంటున్నారన్నారు.యువత ఏ ఏమోషన్ పై ఉంటుందనేదే రాజకీయ నాయకుల విజయాన్ని  నిర్ణయిస్తుందన్నారు.. ఎవరైతే విన్నింగ్ పర్సంటేజ్ ఉంటుందో వారు యువతనే నని రాజు జనగాం అభిప్రాయపడ్డారు. ఎన్నిక ఏదైనా యువత పాత్రే కీలకమన్నారు. ఎన్ని కల సమయంలో యువత అయోమయంలో ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో  పాల్గొన్న సురేపల్లి సుజాత  మాట్లాడుతూ… ఇప్పుడున్న యువతను చూస్తే భయే ముస్తుందని, యువతకు పోలిటికల్ అవేర్ నేస్ అవసరమన్నారు. మన విద్యా విధానం మారాలని చెప్పారు.రాజకీయాలు వ్యాపారం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. చదువుకున్నవారు రాజకీయాల్లోకి రాకపోతే చదువు కొని వారు పాలిస్తారన్నారు. ప్రస్తుత కాలంలో  మారోజు వీరన్న .. జార్జిరెడ్డి లాంటి వారు ఎందుకు రావడం లేదని యువతను ప్రశ్నించారు. ఎలక్షన్ లోడబ్బు రాజకీయం ఎక్కువైందన్నారు. మంచి రాజకీయాలు లేక పోతే మంచి పాలన రాదన్నారు. ఇది యువత చేతుల్లోనే ఉందన్నారు.నమ్మకం పోయింది దొర అనే మీమ్స్ బాగా వస్తున్నాయన్న ప్రశ్న కు సమాధానంగా .. ఆకెళ్ల గారు మాట్లాడుతూ ..పాలిటిక్స్ అయినా ఏ వ్యవస్థ అయినా నమ్మకమే… ఏ వ్యవస్థ అయినా సరిగా పని చేస్తుందంటే నమ్మకమే ముఖ్యమన్నారు.ఈ సెమినార్ హాల్లో మనం మాట్లాడుకున్నంత మాత్రాన ఏవి చలించవు..ఒక మనిషి తప్ప.. రాజకీయాలు బాలేనపుడు వాటిని బాగుచేయ లేనపుడు ఏ ప్రయత్నం చేయకపోతే విమర్మించేహక్కు లేదన్నారు..ఎన్నికల సమయంలో మీ ఊరు వెళ్లి ప్రజలను  చైతన్యపర్చాలన్నారు.యువత రాజకీయాల్లోకి రావాలని కోరుకొండి… దాన్న నిర్ణయించుకొండి ఎవరైనా రాజకీయ నాయకులు పుట్టుకతో రారు.చేస్ ఆడటానికి బుర్ర కావాలి… పాలిటిక్స్ అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలియాలన్నారు.నేలంటి మధు  మాట్లాడుతూ ..రాజకీయ వృత్తి అనే పుస్తకాన్ని బుక్ ఫెయిర్‌లో ఒక స్టాల్‌  పెడితే ఇది సంబంధం లేనిది గా దూరం జరిగారు.రాజకీయాలు బాగాలేవు అనడం కాదు అవి మనవే అనుకోవాలి . నేచర్ ఆఫ్  పాలిటిక్స్ అనేవి యువత నుంచి రావాలి 52 % యువత ఉన్నపుడు రాజకీయాలు ఎందుకు అంట రాని వారుగా చూస్తున్నారు. రాజకీయాలను యువతపట్టించుకుంటే… రాజకీయాలు మిముల్ని పట్టించుకుంటా యని మధు గారు అన్నారు.. రాజకీయాలను రీపేర్ చేయనప్పుడు అవి బాగుపడవు . అలా చేయాలంటే ఎన్నికల్లో యువత పాత్రను పోషించాలి.

సీఎం లు అంటేఅది బ్రహ్మ పదార్థం కాదు. CBN, KCR, YS వీళ్లెవ్వరూ పుట్టుకతో రాలేదు.. పాలిటిక్స్ ఎంట్రి డిసైడ్ చేసుకొండి… రాజకీయాల్లో ఓట్లును ఎలా పొందాలనే ఈ జీ మెథడ్ డబ్బు… కానీ పని చేసే నాయకులకు ఎప్పుడు గెలిపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. మీ అవసరాలు మీకే తెలుస్తాయి కాబట్టి యువత రాజకీయాల్లోకి రావాలని మధు గారు అభిప్రాయ పడ్డారు.కోట శ్రీనివాస్  మాట్లాడుతూ…ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డ ఈ సమయం లో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా మంచి నిర్ణయమన్నారు.క్యాపిటేషన్ ఫీజు పెంచడంతో సీఎం రాజీనామా చేపించిన చరిత్ర విద్యార్ధుల కు ఉన్నది.. ఒక మంచి సమాజం ఏర్పడాలంటే.. మంచి రాజకియాలు రావాలి . రాజకీయాల్లోకి రానంత కాలం నేరస్తులే ఏలుతారు . పదో తరగతి కూడా చదవో నోళ్లు చదువుకున్న వాళ్ల ను శాసిస్తున్నారు.76  ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా అసమానతలు ఉన్నాయన్నారు . మనకు మనం స్వీయ విమర్శ చేసుకోవాల్సిన అవసరం యువత పై ఉందన్నారు. ఒక నాయకుడి అవి నీతిని ప్రశ్నిస్తే…సోషల్ మీడియా వారియర్స్ గా ఉంటూ నాయకుల గురించి కొట్టుకుంటూ వారి జెండాలు మోస్తు యువత వారి మత్తులో ఉందన్నారు.విద్యార్ధులు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేకనే యూనివర్సిటీలో ఎన్నికలను నిషేదించారన్నారు.తెలంగాణలో జరిగిన ప్రతీ పరీక్షలో పేపర్ లీకేజీ కామన్ అని ఓ మంత్రి మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవ్వరూ అధికారంలో ఉండాలన్నది 33 లక్షల నిరుద్యోగ యువత డిసైడ్ చేస్తుందని కోటా శ్రీనివాస్ అభిప్రాయ పడ్డారు. అనంతరం జరిగిన చర్చా వేదిక లో పాఠకులు అడిగిన పలు ప్రశ్నలకు వక్తలు సమాధానాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో  విధాత టీం పాల్గొన్నారు

 

Optimized by Optimole